జనసేన ముఖ్యనేతలతో పవన్ భేటీ-లోకేష్ సభపై చర్చ! సీట్లపై తేల్చేస్తారా ?

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గపడుతుండటంతో రాజకీయ పార్టీలన్నీ సీట్ల ప్రకటన, వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగితేలుతున్నాయి. ఇదే క్రమంలో వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎన్నికల్లో సత్తా చాటుకునేందుకు టీడీపీ-జనసేన ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పలుమార్లు భేటీ అయి సీట్ల సర్దుబాట్లపై చర్చించారు. ఈ మేరకు సీట్ల పంపకాలు కూడా దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. దీంతో పాటు రేపు నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు బహిరంగసభపై చర్చించేందుకు పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.

ఇవాళ హైదరాబాద్ నుంచి గన్నవరానికి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అక్కడి నుంచి మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లారు. మధ్యాహ్నం జనసేన నేతలతో ఆయన భేటీ అయ్యారు. టీడీపీతో కుదిరిన సీట్ల సర్దుబాటుతో పాటు ఆయా స్ధానాల్లో అభ్యర్ధుల ఎంపిక, మిగతా స్ధానాల్లో అసంతృప్త నేతలకు బుజ్జగింపులు వంటి అంశాలపై పవన్ కళ్యాణ్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు రేపటి నారా లోకేష్ బహిరంగసభపైనా పవన్ చర్చిస్తున్నారు.

pawan kalyan met janasena key leaders, discussions on tickets, nara lokesh meeting

టీడీపీతో సీట్ల సర్దుబాటు విషయంలో తలెత్తిన ప్రతిష్టంభన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తొలుత నారా లోకేష్ యువగళం సభకు వెళ్లకూడదని భావించారు. కానీ చంద్రబాబు స్వయంగా పవన్ ఇంటికెళ్లి చర్చలు జరపడంతో ఆయన మెత్తబడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేపు పోలేపల్లిలో జరిగే లోకేష్ యువగళం సభలో అనుసరించాల్సిన వ్యూహంపై పవన్ జనసేన నేతలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సభలో చంద్రబాబుతో కలిసి పవన్ ఉమ్మడి ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీటికి సంబంధించిన కసరత్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+