BJPని దెబ్బకొడుతున్న పవన్ కల్యాణ్?
ఆంధ్రప్రదేశ్ లో పాగా వేయాలనుకుంటున్న తమ లక్ష్యానికి జనసేనాని పవన్ కల్యాణ్ దెబ్బకొడుతున్నారని భారతీయ జనతాపార్టీ అంతర్మథనం చెందుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై పోరాడేందుకు తన మిత్రపక్షంగా బీజేపీని పవన్ రోడ్ మ్యాప్ అడిగారు. వారి నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో విసుగు చెందిన పవన్ విశాఖపట్నంలో అసహనాన్ని ప్రకటించారు.

ఉలిక్కిపడ్డ బీజేపీ, వైసీపీ
కొద్దిరోజులకు అదే విశాఖలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసి 30 నిముషాలు చర్చించారు. దీంతో జనసేన-బీజేపీ కలిసే వెళతాయని అందరూ భావించారు. అందుకు తగ్గట్లుగా పవన్ కల్యాణ్ కూడా తనకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలంటూ సమావేశాల్లో ప్రజలను కోరసాగారు. తర్వాత అకస్మాత్తుగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనని మరోసారి ప్రకటించడంతో బీజేపీతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉలిక్కిపడింది.

వ్యూహాత్మకంగా పవన్ కల్యాణ్
ఈ విషయంలో పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా వ్యవహరించసాగారు. తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతున్నట్లు కనిపిస్తున్నా భారతీయ జనతాపార్టీపై ఎక్కడా విమర్శలు చేయడంకానీ, పొత్తుండదని చెప్పడంకానీ చేయడంలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీని ఢీకొట్టాలంటే బీజేపీ-జనసేన బలం సరిపోదని ఆలోచించే తెలుగుదేశం పార్టీని కలుపుకుపోవాలని యోచిస్తున్నారు. వైసీపీని గద్దె దించడమే తన లక్ష్యంగా ప్రకటిస్తున్నారు. రాన్రాను టీడీపీ-జనసేన బంధం బలపడుతోంది. విశాఖ పరిణామాలకు పవన్ ను కలిసి చంద్రబాబు సంఘీభావం తెలియజేశారు. కుప్పం పరిణామాలకు చంద్రబాబును పవన్ కలిసి సంఘీభావం తెలియజేశారు.

అంతర్గతంగా ఖరారైన పొత్తు?
అంతేకాకుండా అంతర్గతంగా ఈ రెండు పార్టీల మధ్య ఏయే నియోజకవర్గాల్లో పొత్తుతో పోటీచేయాలనే విషయం కూడా ఖారారైందని, ప్రస్తుతం బహిరంగంగా తెలియజేయడంలేదని, బీజేపీ తీరు తెలిసిన తర్వాత ఒక స్పష్టత వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే చంద్రబాబు-పవన్ కల్యాణ్ మైత్రి బలపడతుండటం రాష్ట్ర బీజేపీ నేతలకు రుచించడంలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని ఎంత దూరంగా పెట్టగలిగితే తాము ఏపీలో అంత బలపడతామని, అంతేకాకుండా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అధిష్టానం కూడా ససేమిరా అంటోందంటూ సంకేతాలు పంపిస్తున్నారు. బీజేపీ ఎంత బలంగా పవన్ ను ఆపుతుందో అంతకంటే బలంగా చంద్రబాబువైపు పవన్ అడుగులు పడుతున్నాయి. చివరకు ఎటు తిరిగి ఎటువైపు పయనిస్తుందో బీజేపీ నేతలకే తెలియాలి.
మరి... పవన్ కోరినట్లుగా రోడ్ మ్యాప్ అందించి.. అధికార వైఎస్సార్సీపై పోరాడేందుకు బీజేపీ సహకరించవచ్చు కదా ? రాష్ట్రంలో బలపడేందుకు అందివచ్చిన అవకాశంగా ఉన్న పవన్ .. దూరమయ్యే పరిస్థితులు ఉత్పన్నమైనా బీజేపీ ఎందుకు ఈ విషయంలో పట్టువీడటం లేదు ? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే.. ఇందుకు మరో బలమైన కారణం ఉందనే వాదన వినిపిస్తోంది. కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఇప్పటికిప్పుడు వైఎస్సార్సీపీతో వైరం పెట్టుకునేందుకు సానుకూలంగా లేరు. కారణం... జగన్ పార్టీకి రాజ్యసభలో ఉన్న ఎంపీల సంఖ్యే. ప్రస్తుతం ఎగువ సభలో వారికి 9 మంది ఎంపీలు ఉన్నారు. కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులు సులువుగా పాస్ కావడం అనే అంశంతో పరిశీలిస్తే.. ఆ సంఖ్య చాలా కీలకం. పైగా... కేంద్రానికి సంబంధించిన ప్రతి అంశంలో సీఎం జగన్ మద్దతు తెలుపుతూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో.. వైఎస్సార్సీపీతో ఇప్పటికిప్పుడు వైరం పెంచుకోవాల్సిన ఆవశ్యకత లేదనే అభిప్రాయం బీజేపీ పెద్దల మదిలో ఉందనే వాదన ఉంది. ఇది ఒక రీజన్ అయితే... మరోసారి టీడీపీతో పొత్తుపెట్టుకుంటే... ఏపీలో సొంతంగా ఎదగాలన్న లక్ష్యం నెరవేరదు అనే సందేహం మరొకటనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ కారణాలతోనే... పవన్ ఎంత ఒత్తిడి చేసినా.. టీడీపీతో కలిసి కూటమి కట్టేందుకు బీజేపీ సిద్ధంగా లేదని.. ఆ పార్టీ నేతల వైఖరి చూస్తే స్పష్టం అవుతోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో... పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకుంటారు ? బీజేపీతో కలిసి సాగుతారా ? లేక టీడీపీతో పొత్తు కోసం అడ్డుచెబుతోన్న బీజేపీని పక్కన పెడతారా ? రాష్ట్రంలో ప్రధాన పక్షంగా నిలవాలన్న ఆశలతో ఉన్న బీజేపీ ఈ మొత్తం పరిణామాలపై ఎలా స్పందిస్తుంది ? ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగనుంది ? అనే ప్రశ్నలకు సమాధానాల కోసం అంతా వేచి చూస్తున్నారు
అధికార వైఎస్సార్సీపీపై పోరాడేందుకు బీజేపీ నుంచి ప్రణాళికలు అడిగారు పవన్. అయితే.. ఈ విషయంలో వారి నుంచి ఆశించిన స్పందన రాలేదు. చూసి చూసి విసుగుచెందిన జనసేనాని.. మిత్రబంధంపై విశాఖ వేదికగా అసహనం వ్యక్తం చేశారు. కొన్ని రోజులకే ప్రధాని మోదీ విశాఖకు రావడం... ఆయనతో పవన్ కళ్యాణ్ అరగంట పాటు సమావేశమై వివిధ అంశాలపై చర్చించడంతో... సమస్యలకు ఫుల్ స్టాప్ పడ్డట్లే అని అంతా అనుకున్నారు. అయితే.. పవన్ మాత్రం కొన్ని రోజులకే మళ్లీ బీజేపీకి షాక్ ఇచ్చారు. సీఎం జగన్ ను గద్దె దించడమే తన లక్ష్యమని.. అందుకోసం విపక్షాల ఓట్లు చీలనివ్వబోనని స్పష్టం చేశారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేయాలన్న ఆకాంక్షను పవన్ వెలిబుచ్చారు. ఆ తర్వాత అధికార పార్టీ... విశాఖలో పవన్ ని, కుప్పంలో చంద్రబాబుని అడ్డుకోవడంతో.. ఇద్దరు నేతలు పరస్పరం సంఘీభావం తెలుపుకున్న సందర్భాలు... పొత్తులకు పొద్దు పొడిచేలా చేసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications