అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ కల్యాణ్ విషయంలో ఏదో తేడా కొడుతోందే..

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రానున్న ఎన్నికల్లో పదుల సంఖ్యలో తమ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించేలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒంటరిగా పోటీచేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి మాత్రమే కారణమవుతోందని భావిస్తున్న ఆయన రానున్న ఎన్నికల్లో పొత్తుల గురించి మాట్లాడుతున్నారు. తెలుగుదేశం-జనసేన మధ్య దాదాపుగా పొత్తుంటుందటూ వార్తలు వచ్చిన తరుణంలో ప్రధానమంత్రితో జనసేనాని భేటీ అయ్యారు. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయం మొదటికి వచ్చిందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నారు.

అవినీతిని వెలుగులోకి తెస్తా

అవినీతిని వెలుగులోకి తెస్తా

విజయనగరం జిల్లాలోని గుంకలాంలో జగనన్న ఇళ్ల కాలనీలను పవన్ సందర్శించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని, అవినీతి రహిత పరిపాలన అంటే ఎలా ఉంటుందో మీకు చూపిస్తానని, అందుకే జనసేనకు అవకాశం ఇవ్వాలని కోరారు. 'ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. అవినీతిని వెలుగులోకి తెస్తా' అని ప్రకటించారు. ఈ ప్రకటన ముందువరకు పవన్ కల్యాణ్ పై వైసీపీ నుంచి వచ్చే విమర్శలను తిప్పి కొట్టే బాధ్యత తెలుగుదేశం తీసుకునేది. మాజీ మంత్రులు, ఇతర నాయకులు మాట్లాడేవారు.

తెలుగుదేశం పార్టీలో అంతర్మథనం

తెలుగుదేశం పార్టీలో అంతర్మథనం

ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. అని పవన్ ఎప్పుడైతే అన్నారో అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీవైపు నుంచి జనసేనకు మద్దతు ఆగిపోయినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ పై వైసీపీ నేతలు ఏ కామెంట్లు చేసినా టీడీపీ నాయకులు వెంటనే ఖండనలిచ్చేవారు. మూడు పెళ్లిళ్ల విషయంలో కూడా వైసీపీకి టీడీపీ నాయకులు రీకౌంటర్లు ఇచ్చారు.

'ఒక్క ఛాన్స్' ప్రకటన తర్వాత టీడీపీ నాయకులు జనసేనను పట్టించుకోలేదు. కనీసం ఆ వ్యాఖ్యలకు మద్దతుగా కూడా ఎవరూ మాట్లాడలేదు. పవన్ అందిపుచ్చుకున్న ఈ స్లోగన్ విషయంలో తెలుగుదేశం పార్టీ అంతర్మథనం చెందుతోందని భావిస్తున్నారు. ఎన్నికల విషయంలో చెప్పినట్లుగా ఒక్క ఛాన్స్ అనేసరికి ఏదో తేడా కొడుతోందంటున్నారు.

 నాన్చుడు ధోరణి వద్దు.. తేల్చేయండి

నాన్చుడు ధోరణి వద్దు.. తేల్చేయండి


మోడీతో భేటీ తర్వాత ముభావంగా కనిపించిన పవన్ మూడురోజుల తర్వాత ప్రధానమంత్రిని పొగుడుతూ ట్వీట్ చేశారు. తర్వాత ఒంటరి పోరుకైనా సిద్ధమేనని, వైసీపీని గద్దె దించుతానని చెబుతున్నారు. దీన్నిబట్టి టీడీపీ-జనసేన మధ్య పొత్తుంటుందా? లేదా? అనే విషయం డోలాయమానంలో పడింది. ఇరు పార్టీలకు చెందిన శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. పొత్తులపై దాగుడుమూతలు వద్దని, ఏ విషయం స్పష్టం తేల్చేయాలని ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు తమ అధినాయకత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

English summary
Janasena chief Pawan Kalyan is trying hard to get dozens of MLAs to represent his party in the upcoming elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X