టీడీపీ ఒక్కటే చేసుంటే...: ఓటుకు నోటుపై పవన్ స్పందన ఇది

తెలుగుదేశం పార్టీ ఒక్కటే చేసుండుంటే.. ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడేవాడినని, అంతకు ముందు చాలా పార్టీలు ఇలా చేయబట్టే దానిపై స్పందించలేదని జనసేన అధ్యక్షుడు పవన్ స్పష్టం చేశారు.

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఒక్కటే చేసుండుంటే.. ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడేవాడినని, అంతకు ముందు చాలా పార్టీలు ఇలా చేయబట్టే దానిపై స్పందించలేదని జనసేన అధ్యక్షుడు పవన్ స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

టీడీపీ ఒక్కటే అలా చేసుంటే చాలా బలంగా నిలదీసేవాడినన్నారు. అన్ని పార్టీలూ అలానే చేస్తాయని అందుకే నోటుకు ఓటు గురించి మాట్లాడలేదన్నారు. కొన్ని విషయాలను చూసీ చూడనట్టు వదిలేశానని, దానికి చాలా మంది టీడీపీని వెనకేసుకొస్తున్నానని అంటున్నారని ఆయన గుర్తు చేశారు.

Pawan Kalyan on vote for cash issue

అసలే విడిపోయిన రాష్ట్రాల్లో గొడవలు చేస్తే పరిపాలన మీద ప్రభావం పడుతుందనే ఉద్దేశంతోనే పెద్ద ఇష్యూ చేయలేదన్నారు. తాను రాజకీయాల్లోకి రావటానికి కారణం దశాబ్దాలుగా పరిష్కారం చేయాల్సిన సమస్యలను పరిష్కరించక పోవటమేనని అన్నారు.

అవకాశవాద రాజకీయాలు తనకు నచ్చలేదని, అందుకే పార్టీ పెట్టానని పవన్ వివరించారు. తాను ఆనాడు టీడీపీ, బీజేపీకి సమర్ధించటానికి కారణం అనేక సమస్యలను కాంగ్రెస్ పరిష్కరించకపోవటమేనని ఆయన స్పష్టం చేశారు. మరి ఈరోజు మాట ఇచ్చ్చిన వాళ్ళు మాటతప్పారని అందుకే ప్రభుత్వాలని నిలదీస్తున్నామని పవన్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+