హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కష్టాలు మీరే తీర్చండి.. పవన్‌కు కొత్త బాధ్యత.. రండి అంటూ కన్నాకు ఫోన్, తెలంగాణ లెక్కనే!

|
Google Oneindia TeluguNews

అమరావతి: భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖపట్నంలో నవంబర్ 3న లాంగ్ మార్చ్ కూడా తలపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై పవన్ కళ్యాణ్ తాజాగా మరోసారి స్పందించారు.

పచ్చని చెట్ల మధ్య పవన్ కళ్యాణ్: లుంగీలో గోవుల మధ్య గోపాలుడిలా!(వీడియో)

కన్నా లక్ష్మీనారాయణకు పవన్ కళ్యాణ్ ఫోన్

కన్నా లక్ష్మీనారాయణకు పవన్ కళ్యాణ్ ఫోన్

ఇసుక దొరకక ఉపాధి కోల్పోయి అల్లాడిపోతూ ఆహ్మహత్యలకు పాల్పడుతున్న భవన నిర్మాణ కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. నవంబర్ 3వ తేదీన విశాఖపట్నంలో తలపెట్టిన లాంగ్ మార్చ్‌లో పాల్గొనవలసిందిగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు. ఇందుకు కన్నా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. బుధవారం మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ కన్నా లక్ష్మీనారాయణతో ఫోన్‌లో మాట్లాడారు. లాంగ్ మార్చ్ తలపెట్టడానికి గల కారణాలను ఈ సందర్భంగా వివరించారు.

పవన్ కళ్యాణ్‌కు కార్మికుల కష్టాలు..

పవన్ కళ్యాణ్‌కు కార్మికుల కష్టాలు..

ఆగస్టు 4వ తేదీన భీమవరం సమావేశంలో పాల్గొనడానికి రాజమండ్రి నుంచి భీమవరం వెళుతున్న సందర్భంలో సిద్ధాంతం వద్ద భవన నిర్మాణ కార్మికులు పవన్ కళ్యాణ్ వాహనాన్ని ఆపి తమ కష్టాలను తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇసుక దొరకక తమ ఉపాధి పోయిందని వివరించారు. మంగళగిరికి వెళ్ళినప్పుడల్లా భవన నిర్మాణ కార్మికులు వచ్చి కలుస్తూనే ఉండేవారు.

ఆత్మహత్యలు చేసుకుంటున్నారు..

ఆత్మహత్యలు చేసుకుంటున్నారు..

కొత్త ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ తెస్తున్నామని చెప్పడంతో సమస్య పరిష్కారం అవుతుందన్న కొంత ఆశ ఉండేదని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే రాను రాను సమస్య మరింత తీవ్రతరమై ఇసుక అందరాని సరుకుగా మారిపోయిందని.. చివరకు ఉపాధిలేక కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ క్రమంలోనే భవన కార్మికులకు మద్దతుగా విశాఖలో లాంగ్ మార్చ్‌కు పిలుపు నిచ్చారు పవన్.

మీరేనంటూ పవన్ కళ్యాణ్‌కు కార్మికులు

మీరేనంటూ పవన్ కళ్యాణ్‌కు కార్మికులు

అధికారిక లెక్కల ప్రకారం ప్రత్యక్షంగా 17.80 లక్షల మంది, పరోక్షంగా మరో 17 లక్షల మంది ఉపాధి కోల్పోవడంతో ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ దృష్టికి కూడా పవన్ కళ్యాణ్ తీసుకెళ్లారు. ఇసుక సమస్య పరిష్కారం కావాలంటే ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని రాజకీయ పక్షాలు కలసి కట్టుగా పోరాడాలని మంగళవారం సాయంత్రం పవన్ కళ్యాణ్‌ని కలిసిన కొందరు భవన నిర్మాణ కార్మికులు విజ్ఞప్తి చేశారు. దీనికి పవన్ కళ్యాణ్ చొరవ చూపాలని కోరారు.

తెలంగాణలోలా..

తెలంగాణలోలా..

తెలంగాణాలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెలో అక్కడి రాజకీయ పార్టీలు చూపుతున్న సంఘీభావాన్ని, ఐక్యతను ఇసుక సమస్య పరిష్కారంలో ఇక్కడి నేతలు ముందుకు రావాలని విన్నవించారు. వారి విన్నపానికి సంసిద్ధత తెలిపిన పవన్ కళ్యాణ్ ముందుగా కన్నా లక్ష్మి నారాయణతో మాట్లాడారు. ఆయన ఇందుకు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.

English summary
Janasena president Pawan Kalyan phone call to AP BJP president Kanna Lakshminarayana for Long March.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X