వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోడి కత్తితో పొడిపించుకోను ! జనం కోరుకుంటేనే సీఎం ! ప్రత్యేక రాష్ట్రాలొద్దు-పవన్ కామెంట్స్

ఏపీలో తాజా రాజకీయాలపై రిపబ్లిక్ డే ప్రసంగంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కోడికత్తి రాజకీయాలతో సీఎం కానని, జనం కోరుకుంటేనే అవుతానని జనసేనాని వెల్లడించారు.

|
Google Oneindia TeluguNews

మంగళగిరి : గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనసేన రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో జననేనాని పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. వేడుకల్లో జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఇందులో పలు కీలక అంశాల్ని ప్రస్తావించారు. తన వారాహి వాహనంపై జరుగుతున్న రచ్చతో పాటు వైసీపీ ప్రభుత్వ పాలనపై పవన్ విమర్శలు ఎక్కుపెట్టారు. జీవో నంబర్ 1 వ్యవహారాన్ని కూడా ప్రస్తావిస్తూ పవన్ సెటైర్లు వేశారు.

వారాహిపై విమర్శలపై పవన్


రోడ్డు మీదకు వస్తానంటే మిమ్మల్ని ఆపేస్తాం, తోసేస్తాం, కింద పడేస్తాం..అంటున్నారని పవన్ కళ్యాణ్ ఇవాళ వైసీపీ సర్కార్ తెచ్చిన జీవో నంబర్ 1ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలాగే మీ వారాహి మా ఏపీ రోడ్లపై ఎలా తిరుగుతుందో మేమూ చూస్తామని కూడా అంటున్నారని పవన్ ఆక్షేపించారు. తానెలా ఆలోచిస్తానంటే వింటానని, మాట్లాడనని, ఈ రంగు కాదు, ఆ రంగు కాదని ఒక్కొక్కరూ పేట్రేగిపోయారంటూ వైసీపీ మంత్రులు, నేతల్ని ఉద్దేశించి పవన్ విమర్శించారు.

కోడికత్తులతో పొడిపించుకోను..

కోడికత్తులతో పొడిపించుకోను..

తాను మర్డర్లు, కోడి కత్తులతో పొడిపించుకోవడం వంటి పనులు చేయనని పవన్ స్పష్టం చేశారు. తాను చట్టాల్ని పాటించేవాడిని, వాటిని అతిక్రమించి బండిని(వారాహి)ఎందుకు బయటికి తెస్తామని పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తప్పుడు పనులు చేసి వేల కోట్లు దొబ్బేసి, వేల ఎకరాలు దోచేసుకుని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని కూడా దుర్వినియోగం చేసిన మీకే ఇంత ధైర్యం ఉంటే ఏ తప్పూ చేయని మాకెంత ఉండాలని ప్రశ్నించారు. మీరు మాతో గొడవ పెట్టుకోండి, అప్పుడు మేం ఏంటో చెప్తామన్నారు.

వారాహికి మదమెక్కాక దండయాత్ర !

వారాహికి మదమెక్కాక దండయాత్ర !

పవన్ కళ్యాణ్ ప్రసంగం సాగుతున్న సమయంలో జనసేన కార్యకర్తలు వారాహి దండయాత్ర అంటూ నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన పవన్.. వారాహికి కాస్త మదమెక్కనీయండి, అప్పుడు దండయాత్ర చేద్దామంటూ వారిని సముదాయించారు. అనంతరం ధర్మపురిలో వారాహి పూజకు పురోహితులు, పూజారులు, ఆలయ సిబ్బందికి, ఈవోకి, కమిటీ ఛైర్మన్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఇన్ని సంవత్సరంలో ఏపీలో తిరిగినా కానీ దుర్గమ్మ దర్శనం చేసుకోవాలనిపించలేదని, కానీ తాను దుర్గాదేవి భక్తుడినే, కానీ ఎందుకో అనుమతి రాలేదన్నారు. కానీ వారాహి తీసుకున్నాక ఇంద్రకీలాద్రి నుంచి పిలుపువచ్చిందని పవన్ తెలిపారు. పూజ చేసుకుని వెళ్లిపోదామనుకుంటే దారిపొడవునా పసుపు కుంకుమలతో స్వాగతం పలికిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు.

హిందూ దేవతల్ని దూషించొద్దన్న పవన్

హిందూ దేవతల్ని దూషించొద్దన్న పవన్


హిందూదేవతలపై దూషణలొద్దని నాస్తికులకు పవన్ విజ్ఞప్తి చేశారు. శబరిమల అయ్యప్పపై విమర్శలు చేయొద్దని, దూషణల వల్ల సనాతన ధర్మం పాటించే హిందువులకే కాదు అందరికీ బాధ కలుగుతుందని తెలిపారు. హిందూ దేవతల్ని దయచేసి దూషించవద్దని తెలిపారు. మహమ్మద్ ప్రవక్తను అనడానికి భయమేస్తుంది, జీసస్ ను అనడానికి భయమేస్తుంది కానీ హిందూ దేవతల్ని దూషించడానికి ధైర్యం ఎక్కడి నుంచి వస్తోందని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినంత మాత్రాన వామపక్ష వాదిని అయిపోననన్నారు. చర్చిని అవమానిస్తే, మహమ్మద్ ప్రవక్తను అవమానిస్తే, అయ్యప్ప స్వామి మీద వస్తే కూడా తన గొంతు చాలా గట్టిగా ఉంటుందన్నారు. సెక్యులరిజం పేరుతో నోటికొచ్చినట్లు మాట్లాడొద్దన్నారు. హిందూ ధర్మాన్ని అవకాశవాద హిందువులు దాడి చేసినంతగా మిగతా మతాలు దాడి చేయవని పవన్ పేర్కొన్నారు.

జనం ఒప్పుకుంటేనే సీఎం అవుతానన్న పవన్

జనం ఒప్పుకుంటేనే సీఎం అవుతానన్న పవన్


పార్టీ నిర్మాణం అంటే ఆషామాషీ కాదని, ఇందుకు చాలా కష్టపడాల్సి ఉంటుందని పవన్ తెలిపారు. రాత్రికి రాత్రి తాను సీఎం అయిపోవాలని కోరుకోవడం లేదన్నారు. ప్రజలు ఒప్పుకుంటేనే ముఖ్యమంత్రి అవుతానన్నారు. ఏపీలో రాజకీయ స్ధిరత్వం ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. జనసేన వల్లే రాజకీయ స్ధిరత్వం వస్తే దాన్ని సాధించేందుకు తనలాంటి కూనీకోరు ఉన్నట్లు వెల్లడించారు. దీన్ని సామరస్యంగా సాధించుకోవాలన్నారు. ఇందుకోసం బలమైన శాంతి భద్రతలు ఉండాలన్నారు. ఇష్టారాజ్యంగా కేసులు పెడితే ఎదుర్కొనే పరిస్ధితి ఉండాలన్నారు. నేరాలు లేని ఏపీ జనసేన లక్ష్యమన్నారు. బాబాయిని చంపేసి సీబీఐకి అప్పగించేయడాలు, కోడికత్తితో గీయించేసుకుని, ఏపీ పోలీసులు, డాక్టర్లపై నమ్మకం లేదు, తెలంగాణ డాక్టర్ ట్రీట్ చేశాడని ఆరోగ్యశ్రీ ఛైర్మన్ ను చేయడం తనకు చేతకాదన్నారు. మీరు సెల్యూట్ కొట్టే ముఖ్యమంత్రికి మీరంటే గౌరవం లేదన్నారు. పులివెందుల స్టేషన్లో ఎస్సైనో, సీఐనో కొట్టిన ఘనత ఉన్న ముఖ్యమంత్రి చేతిలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందని పవన్ ప్రశ్నించారు. వైసీపీ మెడలు వంచి సమాధానాలు చెప్పిస్తానన్నారు. ఏపీలో ఏ కులానికి చెందిన వ్యక్తి అయినా ప్రజా ప్రతినిధిగా నిలబడతానంటే ఎవరూ అడ్డుకోలేరు, పోరాడితే పోయేది బానిస సంకెళ్లు మాత్రమేనన్నారు.

తండ్రి శవంతో రాజకీయం చేసే వారిని నమ్మొద్దు

తండ్రి శవంతో రాజకీయం చేసే వారిని నమ్మొద్దు

వైసీపీ నాయకుల్ని తిట్టడం సరదా కాదని పవన్ తెలిపారు. మీరు ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తే తనంత తీవ్రవాది ఉండబోడన్నారు. తనకు ప్రాణభయం లేదన్నారు. వైసీపీ నేతలు ప్రతీ మాట ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలన్నారు. తాను తనకోసం మాట్లాడటం లేదని, ప్రజల కోసం మాట్లాడుతున్నానన్నారు. జనానికి పౌరుషం లేకపోతే ఎట్లా అని పవన్ ప్రశ్నించారు. ఐటీ మంత్రికి 600 ఎకరాలు ఉన్నాయంటున్నారని, ప్రభుత్వం ఐదు వేల ఉద్యోగాలు ఇస్తే సరిపోతాయా అని అడిగారు. తండ్రిపోయి బిడ్డ జైల్లో ఉన్నాడని క్రైస్తవులు ఉపవాస ప్రార్ధనలు చేశారని జగన్ ను ఉద్దేశించి తెలిపారు. జగన్ జైలుకు డబ్బులు దోచుకుని వెళ్లాడని, తిలక్ గా వెళ్లలేదన్నారు. తండ్రి చనిపోగానే శవం పక్కనపెట్టుకుని సీఎం కావాలనుకోవడం సంప్రదాయం కాదని, రాచరికం అన్నారు. అలాంటి వ్యక్తిని కొందరు నమ్ముతారని, మీకు ఇలాంటి వ్యక్తి కావాలా అని పవన్ ప్రశ్నించారు. తాను చెప్పినదాంట్లో హేతువు ఉందా లేదా అని ఆలోచించాలన్నారు. తనతో సహా ఎవరినీ గుడ్డిగా ఆరాధించొద్దన్నారు.

పోరాటాల తెలంగాణ-కులాల ఏపీ

పోరాటాల తెలంగాణ-కులాల ఏపీ

తెలంగాణలా ఏపీ ప్రజలకు తిరుగుబాటు ధోరణి ఉంటే రాష్ట్రం ఎప్పుడో బాగుపడేదన్నారు. ఏపీలో దురదృష్టవశాత్తూ కులాల ధోరణి ఉందన్నారు. తాను కులాల్ని అర్ధం చేసుకున్న వ్యక్తి అన్నారు. జనసేనలోనూ అన్ని కులాల వారు ఉన్నారని పవన్ గుర్తుచేశారు. తన పార్టీలో ఉన్న వారు కూడా కులాలపై విమర్శలు చేయడాన్ని తాను ప్రోత్సహించబోనన్నారు. పాలించడానికి మేమే, పాలించాలంంటే మేమే అని రాజమండ్రిలో ఈ మధ్య ఒకరు అన్నారని, ఆ మాట మిగతా సామాజిక వర్గాలకు ఎంత బాధ కలుగుతుందో అర్ధం చేసుకోవాలన్నారు. కానీ ఒకరు చేసిన కామెంట్ ను అందరికీ వర్తింపచేయలేమన్నారు. తన పార్టీలో ఎవరైనా ఇలా మాట్లాడితే తాను తప్పుబడతానని అన్నారు. కోనసీమలో సొంతమంత్రి విశ్వరూప్ ఇల్లు తగులబెట్టిన వైసీపీ నేతలు, సీఎం జగన్ ఇప్పటికీ ఆయన్ను కనీసం పరామర్శించలేదన్నారు.

వేర్పాటు డిమాండ్లపై పవన్ ఫైర్

వేర్పాటు డిమాండ్లపై పవన్ ఫైర్


సజ్జల గారు ఈసారి వైసీపీపై ప్రధానికి ఫిర్యాదు చేస్తానని పవన్ చెప్పారు. వైసీపీపై కచ్చితంగా ఫిర్యాదు చేస్తానన్నారు.

ఏపీలో ఆలయాలు కూల్చేస్తూ మీకు మాత్రం వైసీపీ నేతలు దేవుడి బొమ్మలు ఇస్తున్నారని ఫిర్యాదు చేస్తానన్నారు.
రాయలసీమ రాష్ట్రం ఇచ్చేయాలంటూ బైరెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏపీలో వేర్పాటు వాద రాజకీయాలు చేస్తే తనలాంటి తీవ్రవాదిని మరోసారి చూడబోరన్నారు. పబ్లిక్ పాలసీని తెలియని మీరు రాష్ట్రాలు విడదీస్తానంటే తోలుతీసి కూర్బోబెడతానన్నారు. తమాషాలుగా ఉందా ఒక్కొక్కరికీ అన్నారు. సన్నాసులతో విసిగిపోయామన్నారు. మా నేలా అంటున్నారని, ఇది మా దేశం కాదా అన్నారు. రాయలసీమ గురించి మాట్లాడుతున్నారని, అక్కడి నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారని, కర్నూలు నుంచి రాజధాని పోతుంటే ఎందుకు కాపాడుకోలేకపోయారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర రాష్ట్రం కోరుతున్న వారికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఇతర ప్రాంతాల వారు చనిపోయిన విషయం తెలుసా అని పవన్ ప్రశ్నించారు.

English summary
janasena chief pawan kalyan on today made key comments on ysrcp govt in republic day speech.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X