ప్రధాని మోదీని ఆ విషయంలో తెగ పొగిడేసిన పవన్ కళ్యాణ్
ప్రభుత్వం జీఎస్టీ లో భారీ సంస్కరణలను చేపట్టింది. ఫలితంగా జీఎస్టీ స్లాబులు భారీగా తగ్గాయి. ప్రస్తుత విధానంలో గతంలో ఉన్న స్లాబ్ ల వ్యవస్థ తొలగిపోయి 5%, 18% స్లాబులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో సామాన్య మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట లభించనుంది.
సెప్టెంబర్ 22 నుండి అమలులోకి రానున్న కొత్త జీఎస్టీ స్లాబులు
ఈ కొత్త విధానం ఈనెల 22వ తేదీ నుంచి అమలులోకి రానుంది. న్యూఢిల్లీలో 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఈ జిఎస్టి స్లాబ్ లను ప్రకటించారు.ముఖ్యంగా ఆరోగ్య అవసరాల నిమిత్తం జిఎస్టి స్లాబ్ లను ఐదు శాతానికి తగ్గించడం వ్యాప్తంగా ప్రజలకు మేలు చేకూరుస్తుంది.

కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించిన చంద్రబాబు
మెజారిటీ వస్తువులు 5శాతం మరియు 18శాతం స్లాబ్ లలోకి రావడం కొన్ని వస్తువులు అయితే జీరో శాతం పన్ను పరిధిలోకి రావడం వల్ల సామాన్య మధ్య తరగతి ప్రజలు ఉపశమనం పొందుతున్నారు . ఈ విధానం వల్ల కేంద్ర ప్రభుత్వ ఖజానాకు 48వేల కోట్ల రెవిన్యూ ఇంప్లికేషన్ గా ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.
మోడీ నిర్ణయాన్ని మెచ్చుకున్న పవన్ కళ్యాణ్
జిఎస్టి స్లాబ్ల సవరణలు తాము స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు దీనివల్ల పేదలకు, రైతుల నుండి వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందన్నారు.ఇక తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిఎస్టి కౌన్సిల్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన ఆయన స్వాతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోట నుండి ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం జీఎస్టీ సవరణలపై ఇచ్చిన హామీని నెరవేర్చినదన్నారు.
ఆరోగ్య సంరక్షణకు తీసుకున్న మంచి నిర్ణయం
ఇప్పుడు జీఎస్టీ భారాన్ని తగ్గించడం ద్వారా తరువాత తరం సంస్కరణలను ముందుకు తీసుకు వచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు, రైతుల ఆరోగ్య సంరక్షణకు ఇది గణనీయమైన ఉపశమనం అని ఆయన పేర్కొన్నారు. విద్య పైన, బీమా పైన జీఎస్టీ ని పూర్తిగా తొలగించడం వల్ల ప్రజల పైన భారం లేకుండా ఉంటుందన్నారు. పేదల భవిష్యత్తును మరింత వృద్ధి చేయడాన్ని, తాను ప్రత్యేకంగా స్వాగతిస్తున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు.
ప్రజల ఆర్ధిక భారాన్ని తొలగించే జీఎస్టీ సంస్కరణలు
కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ సంస్కరణలు కోట్లాది ప్రజల ఆర్ధిక భారాన్ని తొలగిస్తుంది అన్నారు. ప్రజల సంక్షేమం పైన స్పష్టమైన దృష్టితో ఈ సంస్కరణలను తీసుకువచ్చినందుకు ప్రధాని మోదీకి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ జిఎస్టి సంస్కరణలు దేశానికి నిజమైన దీపావళి బహుమతిగా నిలుస్తాయని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications