బీజేపీకి పంచ్: ఈ వివక్ష ఏమిటని నిలదీసిన పవన్ కళ్యాణ్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: యూపీలో రుణమాఫీని కేంద్రమే చేస్తుందంటూ కేంద్రమంత్రి రాధామోహన్ సింగ్ చేసిన ప్రకటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. బీజేపీ తీరును తప్పుబడుతూ ట్విట్టర్ ద్వారా ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.

కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగాచూడాలని సూచించిన పవన్.. బీజేపీ తీసుకున్న నిర్ణయం దేశ సమగ్రతకు ఏమాత్రం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపును పవన్ గుర్తుచేశారు. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పుకొచ్చారు.

Pawan kalyan questioned bjp over crop loans

బీజేపీ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాల్సిందిపోయి ఉత్తరాదిపై ఒకలా దక్షిణాది మరొకలా వ్యవహరిస్తుందని పవన్ అన్నారు. ఈవిధమైన ప్రభుత్వ విధానాలు జాతీయ సమగ్రతకు భంగం కలిగిస్తాయని ఆయన చెప్పారు.

కాగా, ఈ ఉదయం లోక్ సభలో పంట రుణాలపై చర్చ జరగ్గా కేంద్రమంత్రి రాధామోహన్ సింగ్ యూపీ రైతులకు మాత్రమే కేంద్రం రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. మిగతా రాష్ట్రాల ఎంపీలు కూడా కోరినప్పటికీ అన్ని రాష్ట్రాల్లోను కేంద్రం రుణమాఫీ చేయడం కుదరదని స్పష్టం చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Janasena President Pawan Kalayan questioned Central governoment over farmers crop loans. recently, Through twitter he was responded on the issue
Please Wait while comments are loading...