ఆందోళన చెందుతున్నారు, అర్థం చేసుకోండి: చంద్రబాబుకు పవన్ కళ్యాణ్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో ఇష్యూపై స్పందించారు. ఆయన బుధవారం గ్రూప్ 2 మెయిన్స్ అంశంపై ఏపీ ప్రభుత్వానికి హితవు పలికారు. అభ్యర్థుల ఆందోళనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు.

గ్రూప్ 2 మెయిన్స్ వాయిదాపై ప్రభుత్వం ఆలోచించాలన్నారు. గ్రూప్ 2 విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలన్నారు. 45 రోజుల సమయం సరిపోదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారన్నారు.

Pawan Kalyan raises student issue with ap government

కాగా, ఏపీలో గ్రూప్ 2 పోస్టుల భర్తీకి సంబంధించి తాము ఇప్ప‌టికే విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారమే నిర్ణీత తేదీల్లో మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తామని, ఇందులో మార్పులేమీ ఉండ‌బోవ‌ని ఏపీపీఎస్సీ స్ప‌ష్టం చేసింది. అయితే, గ్రూప్-2 ప‌రీక్ష వాయిదా వేయాల‌ని అభ్య‌ర్థులు కోరుకుంటున్నారు. దీనిపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jana Sena chief Pawan Kalyan raises student issue with ap government

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి