పవన్ జైతెలంగాణ: ఈలవేసి గోల చేశారు, కిషన్ ఆగ్రహం

నిజామాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిజామాబాద్‌లోని మోడీ సభ (భారత్ విజయ ర్యాలీ) ప్రాంగణానికి చేరుకున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో ఆయన సభా ప్రాంగణానికి చేరుకున్నారు. పవన్ వచ్చినప్పుడు అభిమానులు, టిడిపి, బిజెపి కార్యకర్తలు ఈల వేసి గోల చేశారు. కేరింతలు కొట్టారు. అంతకుముందు పలువురు నేతలు ప్రసంగించారు. పలువురు నేతల తర్వాత పవన్ ప్రసంగం ప్రారంభించారు. పవన్ జై తెలంగాణ అని తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

యెండల లక్ష్మీనారాయణ

మేడిన్ తెలంగాణ అన్న రాహుల్ గాంధీకి బిజెపి నిజామాబాద్ లోకసభ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ కౌంటర్ ఇచ్చారు. అవసరమైతే మోడీ హయాంలో శాస్త్ర సాంకేతిక రంగాన్ని ఎగుమతి చేస్తామన్నారు. నిజామాబాద్‌కు రైల్వేలైన్ తీసుకు వస్తామన్నారు. యువతకు ఉపాధి కల్పించి వలసలు లేకుండా చూస్తామన్నారు. గల్ఫ్ బాధితులను ఆదుకుంటామన్నారు.

Pawan Kalyan reaches dias

కిషన్ రెడ్డి

దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మోడీ గురించే చర్చిస్తున్నారన్నారు. కాంగ్రెసు పార్టీని పారద్రోలాలని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారని చెప్పారు. బడుగు బలహీవర్గాలకు చెందిన నేత ప్రధానమంత్రి కాబోతున్నారన్నారు. గిట్టుబాటు ధర లేక, అప్పులతో, ఎరువులు దొరకక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. కాంగ్రెసు హయాంలో దేశంలో అన్నింటా సంక్షోభం ఏర్పడిందన్నారు. ఈ సంక్షోభం నుండి దేశాన్ని గట్టెక్కించే సత్తా మోడీకి, బిజెపికే ఉందన్నారు.

బిజెపి అధికారంలోకి వచ్చాక గల్ఫ్ బాధితుల సమస్యలను తీరుస్తామన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చాక గల్ఫ్ బాధితుల సమస్యలను తీరుస్తామన్నారు. బిజెపి తొలి నుండి తెలంగాణకు అనుకూలమన్నారు. చిన్న రాష్ట్రాలకు బిజెపి కట్టుబడి ఉందని చెప్పారు. యూపిఏ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. ఎన్డీయే నేతృత్వంలో బిసి వ్యక్తి ప్రధాని కాబోతున్నారన్నారు.

పవన్ కళ్యాణ్ దేశం కోసం బిజెపికి, మోడీకి మద్దతు పలికారన్నారు. పవన్ కాంగ్రెస్ హఠావో.. దేశ్ బచావో అని పిలుపునిచ్చారన్నారు. కర్నాటకలోను బిజెపికి మద్దతుగా ప్రచారం చేశారన్నారు. కాంగ్రెసుకు, తెరాసకు దేశంలో ఇతర పార్టీల హవా క్రమంగా తగ్గుతుండగా, ఎన్డీయే హవా పెరుగుతోందన్నారు. బిజెపి ద్వారానే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. మోడీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. బిజెపి, టిడిపి కూటమిని ఆదరించాలని కిషన్ రెడ్డి కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+