రేవంత్ హైడ్రా పై పవన్ కీలక వ్యాఖ్యలు - జగన్ దగ్గరే ఎక్కువ..!!

ఏపీలో జరిగిన వరద నష్టం వివరాలను పవన్ వెల్లడించారు. ప్రభుత్వం పైన వైసీపీ విమర్శలు సరికాదని చెప్పారు.బుడమేరులో 90 శాతం ఆక్రమణలు ఉన్నాయని వివరించారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న హైడ్రా పైన పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. సినిమా వాళ్ల కంటే జగన్ వద్దే ఎక్కువ సంపదన ఉందన్నారు. తెలంగాణలోనూ వరదల కారణంగా నష్టం జరగటంతో కోటి రూపాయాలు విరాళం ఇస్తున్నట్లు పవన్ ప్రకటించారు.

పరిస్థితి బాగోలేదు
ఏపీలో ఆర్దిక పరిస్థితి బాగోలేదని పవన్ చెప్పుకొచ్చారు. భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా భారీ నష్టం జరిగినట్లు తెలిపారు. పంటలు, రోడ్లు తీవ్రంగా నష్టపోయినట్లు పవన్ వివరించారు. ఏపీలో 3,312కి.మీ. మేర రోడ్లు కొట్టుకుపోయి రోడ్లు, భవనాల శాఖకు తీవ్రం నష్టం వాటిల్లినట్లు ఆయన వివరించారు. అలాగే 1.69లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగి రైతులు నష్టపోయినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. 18,424హెక్టార్లలో ఉద్యానవన పంటలకు సైతం నష్టం వాటిల్లినట్లు ఆయన చెప్పారు. పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన 233కి.మీ. మేర రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు పవన్ వెల్లడించారు.

Pawan Kalyan reacts over Revanth s Hydra decision comments on ys Jagan

జగన్ హాయంలోనే
వరదల కారణంగా మత్స్యకారులకు చెందిన సుమారు 60పడవలు దెబ్బతిన్నట్లు డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. వరదల పై జగన్ చేసిన వ్యాఖ్యల పై పవన్ స్పందించారు. సినిమా హీరోల కంటే జగన్ దగ్గరే డబ్బులు ఎక్కువ ఉన్నాయన్నారు. సినిమా వాళ్లది హడావుడి ఎక్కువని చెప్పారు.జగన్ దగ్గర లక్ష కోట్లు ఉంటాయని వ్యాఖ్యానించారు. విమర్శలు చేసే వైసీపీ నాయకులు ఇళ్ళల్లో కూర్చుని కాకుండా, బయటకువచ్చి వొళ్ళు వంచి పనిచేసి అప్పుడు మాట్లాడాలని సూచించారు. గత ప్రభుత్వం బుడమేరు ప్రాంతంలో వెంచర్లకు అనుమతి ఇచ్చిందని..జగనన్న కాలనీలు ముంపులో ఉన్నాయని చెప్పారు.

హైడ్రా నిర్ణయం కరెక్ట్
తెలంగాణ సీఎం రేవంత్ హైడ్రా నిర్ణయాన్ని పవన్ సమర్ధించారు. చెరువుల్లో నిర్మాణాలు చేస్తుంటే తాను ఆందోళన చెందానన్నారు. ఏపీలోనూ నిబంధనలకు విరుద్దంగా కట్టిన నిర్మాణాల పై కఠినంగా ఉంటామని చెప్పారు. నిర్మాణాల సమయంలో మౌనంగా ఉంటే ప్రమాదమని చెప్పుకొచ్చారు. వరదల్లో 29 మంది మరణించారని చెప్పారు. తాను బయటకు వస్తే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందనే రాలేదని వివరించారు. తెలంగాణ ప్రభుత్వానికి వరదల సహాయక చర్యల కోసం కోటి రూపాయాలు ఇస్తున్నట్లు పవన్ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+