గ్లోబల్ ఎక్సలెన్సీ అవార్డును అందుకొన్న పవన్ కళ్యాణ్
అమరావతి: సినీ నటుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కి ఇండియా, యూరోపియన్ బిజినెస్ ఫోరం (ఈఈబీఎఫ్) 'గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు'ను శుక్రవారం నాడు లండన్‌లో అందుకొన్నారు. ఈ అవార్డును అందుకొనేందుకు పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితమే లండన్‌కు చేరుకొన్నారు.

ప్రస్తుతం రెండు రోజుల లండన్ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ ఇవాల అవార్డుని అందుకున్నారు. వెస్ట్ మినిస్టర్ పోర్టుక్యూలిస్ హౌస్ ఆఫ్ పార్లమెంట్, బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో జరిగిన సభకు ఆయన హాజరయ్యారు.
రేపు పవన్ కల్యాణ్,యూరప్‌లోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులతో సమావేశం కానున్నారు.2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ చేయనున్నారు.రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండనున్న పవన్ కళ్యాణ్ లండన్ లో విద్యార్థులతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.












Click it and Unblock the Notifications