వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్‌కు చిరు కితాబు, స్టాలిన్‌లా మారాలని.. (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: రాష్ట్ర విభజన అనివార్యం, బాధాకరమైనా సీమాంధ్ర కోసం ఢిల్లీలో బైఠాయించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పోలవరం ప్రాజెక్టుతోపాటు ప్రత్యేక హోదా, ప్యాకేజీలు, పన్ను రాయితీలు ఇలా ఎన్నో హామీలు రాబట్టగలిగామని ఎపిసిసి చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్, కేంద్ర మంత్రి కె చిరంజీవి అన్నారు. సీమాంధ్ర ఉద్యమానికి తాము దూరంగా ఉన్నామనేది వాస్తవం కాదన్నారు.

కిరణ్ ముఖ్యమంత్రిగా ఉంటూ అన్నీ తెలిసి కూడా సీమాంధ్ర మేలు కోసం ఎలాంటి ప్రతిపాదనలు చేయకుండా మెహర్బానీ కోసం కొందరికి ఆర్థిక సహాయం చేస్తూ ప్రజలను రెచ్చగొట్టారని వారు ఆరోపించారు. చివరకు స్వప్రయోజనాల కోసం ఏదో ఆశించి సొంత పార్టీ పెట్టుకున్నారంటూ ఎద్దేవా చేశారు. ఎపియుడబ్ల్యుజె ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం జరిగిన ‘మీట్ ది ప్రెస్'లో రఘువీరా రెడ్డి, చిరంజీవి కలిసి మాట్లాడారు.

నాగార్జునసాగర్ టెయిల్ పాండ్, ఇతర ప్రాజెక్టులకు 6వేల కోట్ల రూపాయల నిధుల కేటాయింపు అక్రమమని, దీనికి మంత్రివర్గ ఆమోదం లేదంటూ తెరాస అధినేత కెసిఆర్ రాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాయటాన్ని ఖండించారు. కాంగ్రెస్‌లో దశాబ్దాల పాటు పదవులు అనుభవించి కష్టకాలంలో వీడివెళ్లేవారి వల్ల వచ్చే నష్టమేమీ లేదని, పీడ వదిలి పునాది వంటి కార్యకర్తలు మిగిలారనుకుంటామన్నారు.

పవన్‌కు చిరు కితాబు, స్టాలిన్‌లా మారాలని..

పవన్‌కు చిరు కితాబు, స్టాలిన్‌లా మారాలని..

అయోమయ స్థితిలో వున్న కార్యకర్తలను ఓదార్చుదామని తాము బస్సుయాత్ర చేపడితే కార్యకర్తలే తమకు ఆత్మస్థయిర్యాన్నిస్తూ ముందుకు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. వెంకయ్య నాయుడు యాత్రను తీర్థయాత్రగా అపహాస్యం చేయటం తగదని ఖండించారు.

పవన్‌కు చిరు కితాబు, స్టాలిన్‌లా మారాలని..

పవన్‌కు చిరు కితాబు, స్టాలిన్‌లా మారాలని..

కాగా, యాత్రలో చిరంజీవి తన సోదరుడు పవన్ కళ్యాణ్ రాజకీయ ఆరంగేట్రంపై స్పందించారు. పవన్‌పై ప్రశంసలు కురిపించారు. పవన్ వంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలన్నారు. కొత్త పార్టీలు పుట్టుకు రావడం వల్ల ఆశావహులకు ఉపయోగంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

పవన్‌కు చిరు కితాబు, స్టాలిన్‌లా మారాలని..

పవన్‌కు చిరు కితాబు, స్టాలిన్‌లా మారాలని..

చిరంజీవి మాట్లాడుతూ పదవి లేకపోతే ప్రాణం పోతుందనుకునే స్వార్థపరులు పార్టీని వీడినా సముద్రం లాంటి కాంగ్రెస్ తొణకదు, బెణకదని అన్నారు.

పవన్‌కు చిరు కితాబు, స్టాలిన్‌లా మారాలని..

పవన్‌కు చిరు కితాబు, స్టాలిన్‌లా మారాలని..

చెత్తాచెదారం బయటకుపోతే యువరక్తానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుందన్నారు. పదవుల కోసం సిద్ధాంతాలు గాలికొదిలేవారు పార్టీలో ఉన్నా, లేకపోయినా ఒకటేనని చెప్పారు.

పవన్‌కు చిరు కితాబు, స్టాలిన్‌లా మారాలని..

పవన్‌కు చిరు కితాబు, స్టాలిన్‌లా మారాలని..

తన బొందిలో ప్రాణం ఉన్నంతవరకూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం సాధ్యమని ఆయన పేర్కొన్నారు.

పవన్‌కు చిరు కితాబు, స్టాలిన్‌లా మారాలని..

పవన్‌కు చిరు కితాబు, స్టాలిన్‌లా మారాలని..

కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం కోసం ప్రతి కార్యకర్త స్టాలిన్‌లా మారాలని, ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ చేసిన మంచి పనులను మరో ముగ్గురికి చెప్పాలని పిలుపునిచ్చారు. తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో ఉందికదా అని వదిలేసి వెళ్లేవారికి మానవత్వం లేదని చిరంజీవి అన్నారు.

English summary
Praising Pawan Kalyan for floating a new party, Union Minister Chiranjeevi on Monday said his brother was the right person to enter politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X