జనసేన అధినేత కీలక నిర్ణయాలు.. అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల ఏర్పాటు!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో తమ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో తమ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
హైదరాబాద్, అమరావతిలో 5 ఎకరాల విస్తీర్ణంలో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే మిగతా జిల్లా కేంద్రాల్లో రెండెకరాల విస్తీర్ణంలో జనసేన కార్యాలయాలు నిర్మించనున్నారు.

Recommended Video

ప్రస్తుతం పార్టీ సభ్యత్వాలపై దృష్టిపెట్టిన పవన్ జనసేన కార్యాలయాల ఏర్పాటును కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని యోచిస్తున్నారు. ఇక, తెలంగాణలో తొలిదశలో ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లోనే కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు.
రెండో దశలో కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లాల్లోనూ జనసేన కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంధించి పార్టీలోని కొంత మందికి పవన్ బాధ్యతలు అప్పజెప్పారు.












Click it and Unblock the Notifications