వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం ...త్వరలో పవన్ పత్రిక .. ప్రకటించిన జనసేనాని

|
Google Oneindia TeluguNews

జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన నేతలతో సమావేశం అయ్యారు . ఆ సమయంలో ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ తరఫున ఒక పత్రిక పెడుతున్నట్లు ప్రకటించారు.

పార్టీ తరపున పత్రిక పెట్టాలని నిర్ణయం తీసుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

పార్టీ తరపున పత్రిక పెట్టాలని నిర్ణయం తీసుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

తాను ప్రారంభించాలనుకుంటున్న పత్రికలో పార్టీ భావజాలం, ప్రణాళికలు, నిర్ణయాలు, ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేసే విధంగా కథనాలు ఉండాలని ఆయన తెలిపారు. జనసేన పార్టీ భావజాలం జనాల్లోకి వ్యాపించటానికి పత్రిక అవసరం అన్న భావనలోకి వచ్చారు పవన్ కళ్యాణ్. అందుకే పత్రిక పెడతానని పార్టీ నాయకులకు చెప్పారు. ఇక తాను ప్రారంభించే పత్రికలో మేధావులు తమ అభిప్రాయాలను వెల్లడించడానికి ఒక వేదిక కల్పిస్తానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు . పవన్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం జనసేన నేతలకు ఒక మంచి పరిణామం అనిపించింది. ఎందుకంటే జనసేన పార్టీ కి గడచిన ఎన్నికల్లో ఏ పత్రికా పెద్ద ప్రాధాన్యత ఇచ్చి వార్తలు ఇవ్వలేదు. అది జనసేనకు పెద్ద మైనస్ అయ్యింది.

మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన నేతలతో సమీక్ష నిర్వహించిన జనసేనాని

మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన నేతలతో సమీక్ష నిర్వహించిన జనసేనాని

ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పత్రిక తోడ్పాటు అందించాలని అన్నారు. పత్రిక స్వరూప స్వభావాలు, శీర్షికలు ఉండాల్సిన అంశాలను నిర్ణయించడానికి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. . జనసేన ఒక ఎమ్మెల్యే స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. ఇక మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ ఓటమిపై నేతలతో సమీక్ష నిర్వహించిన పవన్ కళ్యాణ్ పత్రిక పెట్టాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇది జనసేనకు శుభ పరిణామంగా భావించాలి.

పత్రిక పెట్టాలనే నిర్ణయం అందుకే ..

పత్రిక పెట్టాలనే నిర్ణయం అందుకే ..

ఏపీ ఎన్నికల్లో జనసేన ప్రభావం చూపిస్తుంది అని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలు తారుమారు చేస్తూ జనసేన ఏపీలో శాసనసభ ఎన్నికల్లో ఒక్క స్థానానికే పరిమితం అయ్యింది. ఇక లోక్ సభలో ఖాతా తెరవలేదు .పవన్ కళ్యాణ్ పార్టీలో పవన్ కళ్యాణ్ తో పాటు ఇక పవన్ పార్టీలో ప్రభావం చూపించగల నేతలు కూడా ఓటమి పాలయ్యారు. దీంతో జనసైనికులు నిరాశా నిస్పృహల్లో ఉన్నారు. కనీసం పవన్ కూడా గెలవలేదని ఆవేదనలో ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తారా అన్న అనుమానం వున్నా వాళ్లకు సమాధానంగా పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చెయ్యాలన్న నిర్ణయం తో పాటు ఒక పత్రిక పెట్టి పార్టీ భావజాలం , పార్టీ ప్రణాళిక అన్నీ ప్రజలకు తెలిసేలా చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్.

English summary
Jansena's president, Power Star Pawan Kalyan, met with Janasana leaders at the party office in Manglagiri. At that time he made a sensational decision. The party has announced that it will be a news paper. The articles should be presented to the party ideology, plans, decisions and people from time to time. Pawan Kalyan came into the notion that Janasena party ideology is needed to spread in the public.That is why the party told the leaders about their news paper. Pavan Kalyan has revealed that the paper in which he is introducing a platform for intellectuals to express their opinions. This sensational decision taken by Pawan was a good development for the masses. Because the media has not given any press coverage in the last elections to the party. It became big minus to Janasena . .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X