వాన్నా క్రై బాధితుడిగా పవన్! ట్విట్టర్ హ్యాక్: అభిమానులకు అప్రమత్తత

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసిన వాన్నా క్రై వైరస్ బాధితుల జాబితాలోకి ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేరినట్లు తెలుస్తోంది. అత్యధిక సంఖ్యలో ఫాలోవర్లు కలిగిన పవన్ కల్యాణ్ ట్విట్టర్ అకౌంట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లు తెలిసింది.

అభిమానులకు అప్రమత్తత

అభిమానులకు అప్రమత్తత

ఈ కారణంగానే గత మూడు రోజుల నుంచి పవన్ ట్విట్టర్ ఖాతాలో అంతరాయం ఏర్పడింది. బుధవారం పూర్తిగా బ్లాక్ అయిపోయింది. దీంతో తన ట్విట్టర్ ఖాతాలో అంతరాయం ఏర్పడిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. దీనిపై నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు పవన్. ట్విట్టర్ బ్లాకైందంటూ ఆయన అభిమానులను అప్రమత్తం చేశారు.

పాస్‌వర్డ్ ఛేంజ్..

పాస్‌వర్డ్ ఛేంజ్..

హైదరాబాద్‌లో ‘ధర్నాచౌక్' అంశంపై స్పందించడానికి ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేస్తుంటే పాస్‌వర్డ్ ఛేంజ్ అయినట్లు మెసేజ్ డిస్‌ప్లే అయిందని పవన్ సన్నిహితుల నుంచి అందిన సమాచారం.

గత మూడు రోజుల నుంచీ..

గత మూడు రోజుల నుంచీ..

మూడు రోజుల క్రితమే ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే అవలేదని, ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చని పవన్ భావించాడని అతడి సన్నిహితులు చెబుతున్నారు. అయితే చివరిగా తన అకౌంట్ హ్యాక్ అయినట్లు పవన్ కల్యాణ్ గుర్తించారని తెలిసింది.

కొంత విరామం..

కొంత విరామం..

ప్రస్తుతం పవన్ కల్యాణ్ ట్విట్టర్ అకౌంట్‌ను 18 లక్షల మందికిపైగా ఫాలో అవుతున్నారు. ఎప్పుడూ ట్విట్టర్ ద్వారానే ఎక్కువగా పలు సమస్యలు, అంశాలపై స్పందించే పవన్‌కు.. ఇప్పుడు ట్విట్టర్ హ్యాక్ కావడంతో కొంత విరామం లభించే అవకాశం ఏర్పడింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Janasena Party president Pawan Kalyan on Wednesday said that his twitter account has been hacked.
Please Wait while comments are loading...