ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పిన పవన్ కళ్యాణ్!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పల్లె పండుగ వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో పని చేసే వారికి 15 రోజులకు పని కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్న పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలకు సంబంధించి పని గ్యారెంటీ పైన వారికి గుడ్ న్యూస్ చెప్పారు.

15 రోజుల్లో ప్రభుత్వం పని కల్పించే బాధ్యత
కంకిపాడులో జరిగే పల్లె పండుగ వారోత్సవాలలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా 15 రోజుల్లో ప్రభుత్వం పని కల్పించాల్సిన బాధ్యత ఉందని, ఒకవేళ అలా పని కల్పించలేకపోతే నిరుద్యోగ భృతి అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.

Pawan Kalyan said good news to AP people over Employment Guarantee scheme

కనీసం వందరోజుల పని కల్పించేందుకు కృషి
ప్రస్తుతం తాము ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించేలా పనిచేస్తున్నామని, గ్రామీణ కుటుంబాలకు కనీసం వందరోజుల పని కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆగస్టు 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలో తీర్మానాలు చేసుకున్న పనులకు, నేడు శంకుస్థాపనలు చేస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ పనులను సంక్రాంతిలోపు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా వెల్లడించారు.

సిటిజన్ నాలెడ్జి బోర్డు ఏర్పాటు చేసి పంచాయతీల పనుల వివరాలు
ప్రస్తుతం రాష్ట్రం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో అనుభవజ్ఞుడైన చంద్రబాబు లాంటి వారి అవసరం చాలా ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం ప్రతి పంచాయతీలో ఏం పనులు జరుగుతున్నాయి అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, ప్రతి పంచాయతీ కార్యాలయంలో సిటిజన్ నాలెడ్జి బోర్డు ఏర్పాటు చేసి వివరాలు తెలియపరుస్తున్నామని తెలిపారు.

ఉపాధి హామీ పథకం ద్వారా కృషి
సంవత్సరానికి 10000 కోట్లు ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రానికి నిధులు వస్తాయని చెప్పిన ఆయన దీని ద్వారా నైపుణ్యం లేని వ్యక్తులకు ఉపాధి అందించే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజల జీవితాలు మెరుగుపరిచేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా కృషి చేస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మొత్తంగా ఉపాధి హామీ కూలీలకు శుభవార్త చెప్పిన పవన్ కళ్యాణ్ పనిచేయడానికి ఆసక్తి ఉన్నవారికి 15 రోజుల్లోనే అవకాశం కల్పిస్తామని పల్లె పండుగ వారోత్సవాలలో ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+