Ramoji Rao: రామోజీరావును జగన్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది.. పవన్ కల్యాణ్.. !
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రామోజీ రావు పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత రామోజీ రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
రామోజీరావు ఎన్నో రాజకీయ ఒత్తిళ్లు తట్టుకొని నిలబడ్డారని పవన్ గుర్తు చేశారు. రామోజీరావు మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావును ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి కలుద్దామని అనుకున్నట్లు చెప్పారు. కానీ ఈలోపే ఇలా జరిగిందని పవన్ కల్యాణ్ బాధపడ్డారు. రామోజీరావును జగన్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని గుర్తు చేశారు.
ఇప్పుడు అది లేదన్నారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు దేవుడు అండగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి రామోజీరావు అని పవన్ కొనియాడారు. రామోజీరావు ఏపీ, తెలంగాణలో వేలాది మంది జర్నలిస్టులను అందించారని తెలిపారు. పవన్ కల్యాణ్ తో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత రాధాకృష్ణ రామోజీరావు పార్థివదేహానికి నివాళులు అర్పించారు.

మెగాస్టార్ చిరంజీవి రామోజీరావు పార్థిదేహానికి నివాళులు అర్పించారు. రామోజీరావుకు పెన్నులు అంటే చాలా ఇష్టమన్నారు. ప్రజారాజ్యం పార్టీ నడుపుతున్న సమయంలో ఆయనకు ఒక పెన్ను బహుమతి ఇచ్చినట్లు గుర్తు చేసుకున్నారు. అప్పుడే ఆయన దగ్గరున్న పెన్నుల కలెక్షన్ తనకు చూపించారని చిరు తెలిపారు. తన ఆలోచనలకు తగినట్లుగా వాటిని వినియోగిస్తూ అక్షర రూపంలో పెట్టేవారని చిరు కొనియాడారు.












Click it and Unblock the Notifications