అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇదీ జనసేన, అపాయింట్‌మెంట్ కోరా.. మోడీకైనా ఎదురైళ్తా: కొత్తగా పవన్, సైటొచ్చింది

|
Google Oneindia TeluguNews

అనంతపురం: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం అనంతపురం సభలో జనసేన, రాజకీయాల పైన స్పందించారు. తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదన్నారు. కానీ రాజకీయాలలో జరుగుతున్న దోపిడీ వల్ల నేను రావాల్సి వచ్చిందని అభిప్రాయపడ్డారు.

సినిమాల్లో పోరాటం చేయడం చాలా తేలిక అన్నారు. నిజ జీవితంలో దశాబ్దాలు కావాలన్నారు. ఇందులో సఫలం కాకపోవచ్చు కూడా అన్నారు. తనకు డబ్బుతో కూడిన రాజకీయమంటే అసహ్యమని చెప్పారు. తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని చెప్పారు.

శ్రీశ్రీ జగన్మోహన్.., శత్రువునే: పవన్ కౌంటర్, చంద్రబాబుకు '2' హెచ్చరికలుశ్రీశ్రీ జగన్మోహన్.., శత్రువునే: పవన్ కౌంటర్, చంద్రబాబుకు '2' హెచ్చరికలు

ప్రజా సమస్యల పరిష్కారం తనకు ముఖ్యమన్నారు. తాను అధికారం కోసం, పవర్ కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. పవర్ వచ్చినా అది కొన్నాళ్లే అన్నారు. తనకు మీ సహకారం ఉంటే సరికొత్త రాజకీయం చేద్దామన్నారు. ఏ వర్గాలను అయితే, ఏ కులాలను అయితే వెనుకబాటుకు నెట్టి వేశారో వారికి అండగా ఉంటామన్నారు. పేదవారందరికీ అండగా ఉంటుందని చెప్పారు.

Pawan Kalyan says he seek PM Modi appointment

రాబోయే తరంలో, రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాల్లో అవినీతిలేని రాజకీయం ఉండాలని జనసేనను స్థాపించానని చెప్పారు.

హోదాపై పోరాటం చేస్తా, ప్రధాని వద్దకు వెళ్తా

ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తానని చెప్పారు. కుదిరితే ప్రధాని వద్దకు వెళ్తానని చెప్పారు. ప్రధాని కార్యాలయానికి కూడా తాను సందేశం పెట్టానని చెప్పారు. హోదా ఇస్తామని చెప్పి మోసం చేశారని చెబుతూ తాను ప్రధాని అపాయింటుమెంట్ అడిగానని, ఇంకా ఇవ్వలేదని చెప్పారు. అవసరమైతే ప్రధానికైనా ఎదురెళ్తానని చెప్పారు.

2019లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, ఓడినా పర్లైదు, నేను కూలి పని చేస్తా: పవన్2019లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, ఓడినా పర్లైదు, నేను కూలి పని చేస్తా: పవన్

చంద్రబాబు బీజేపీని ఎలా మెచ్చుకుంటారు?

ప్యాకేజీ విషయంలో మనకు రావాల్సిన వాటా మాత్రమే వచ్చినప్పుడు చంద్రబాబు దానిని ఎలా మెచ్చుకుంటారని పవన్ ప్రశ్నించారు.

కొత్త గెటప్‌లో పవన్

పవన్ కల్యాణ్ అనంతపురంలో నిర్వహిస్తున్నసీమాంధ్ర హక్కుల చైతన్య సభలో ఆయన కొత్త గెటప్‌లో కనిపించారు. ప్రసంగం మధ్యలో పవన్ కళ్లజోడు ధరించి కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజ్ వివరాల ప్రతులను చదివిన పవన్, తనకు సైటొచ్చిందంటూ చమత్కరించారు.

English summary
Jana Sena chief Pawan Kalyan says he seek PM Narendra Modi appointment
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X