పట్టు పెరిగిందా, బెట్టు చేస్తున్నారా - టీడీపీలో పవన్ టెన్షన్..!!

వారాహి యాత్రతో పవన్ కల్యాణ్ లో మార్పు కనిపిస్తోంద. యాత్రకు వస్తున్న స్పందనతో పవన్ పట్టు పెరిగింది. గోదావరి జిల్లాల్లో తానే డిసైడిండ్ ఫ్యాక్టర్ అనే నమ్మకం కనిపిస్తోంది. ఈ సమయంలోనే తన పార్టీ బలోపేతం అయ్యేలా పవన్ వ్యూహాలు అమలు చేస్తున్నారు. పొత్తుకు నో అని చెప్పకపోయినా టీడీపీలో మాత్రం పవన్ టెన్షన్ పెరిగిపోతోంది. అటు బీజేపీ పొత్తుల పై తేల్చకపోవటం..ఇటు చేస్తున్న కామెంట్స్ తో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.

పవన్ మలి విడత యాత్ర: తొలి విడత యాత్ర సక్సెస్ కావటంతో ఈ రోజు నుంచి పవన్ మలి విడత వారాహి యాత్ర ప్రారంభం కానుంది. ఈ సమయంలో పార్టీ నేతలతో పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. పొత్తుల గురించి మరింత డైలమా పెంచారు. మండల స్థాయిలోనూ సమగ్ర అధ్యయనం చేశాకే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించటం ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

Pawan Kalyan second phase varahi Yatra start form Eluru on Sunday, key comment on Alliance with TDP

గతంలోనే పవన్ కల్యాణ్ పొత్తులు ఖాయమని ప్రకటించారు. ఇప్పుడు తిరిగి మండల స్థాయిలో అధ్యయనం అని చెప్పటం ఏంటనేది సస్పెన్స్ కు కారణమవుతోంది. తాను పొత్తుల పై ఒంటరిగా నిర్ణయం తీసుకోవటం లేదని చెప్పటం కోసమా..లేక వారాహి యాత్రకు వస్తున్న స్పందనతో పట్టు పెరిగిందదనే కారణంగా ..పవన్ బెట్టు చేస్తున్నారా అనే చర్చ మొదలైంది.

పట్టు బిగిస్తున్న పవన్: ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పాద ముద్ర బలంగా ఉంటుందని అరమైందని పవన్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ గతంలోనే స్పష్టం చేసారు. అదే సమయంలో బీజేపీతోనూ కలిసి వెళ్లేలా చొరవ చూపించారు. కానీ, బీజేపీ నుంచి ఇంకా పొత్తుల పైన స్పష్టత రాలేదు.

ఎన్డీఏ సమావేశం ఖారరైనా టీడీపీ, జనసేన ను ఆహ్వానిస్తారా లేదా అనేది క్లారిటీ లేదు. ఈ సమయంలో పవన్ తన పార్టీని బలోపేతం చేసుకోవటానికి..పొత్తులు ఉన్నా తాము కోరుకున్న విధంగా సీట్లు సాధించేలా వ్యూహం అమలు చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. అందులో భాగంగానే గోదావరి జిల్లాల్లో పట్టు మరింతగా పెంచుకోవటంతో పాటుగా.. పొత్తుల పైన వ్యూహాత్మక వ్యాఖ్యలు చేస్తున్నారనే అభిప్రాయం కలుగుతోంది.

Pawan Kalyan second phase varahi Yatra start form Eluru on Sunday, key comment on Alliance with TDP

పొత్తుల వ్యవహారంలో బెట్టు: ఈ రోజు ఏలూరులో వారాహి యాత్రలో భాగంగా పవన్ సభ జరగనుంది. సోమవారం మధ్నాహ్నం ఏలూరులో జనవాణి, సాయంత్రం నియోజకవర్గ ముఖ్య నేతలు...వీర మహిళలతో పవన్ సమావేశం కానున్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు దెందలూరు నియోజకవర్గ ముఖ్య నేతలు..వీరమహిళలలతో పవన్ ప్రత్యేకగా సమావేశం అవ్వాలని నిర్ణయించారు.

సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి గూడెం చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. గోదావరి జిల్లాల్లొ వైసీపీ లక్ష్యంగా పవన్ యాత్ర సాగుతున్నా.. పొత్తులపైన ప్రస్తుతం చేస్తున్న వ్యాఖ్యలు..భవిష్యత్ లో తీసుకొనే నిర్ణయాల పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+