పవన్ చెర నుంచి 55 రోజుల తర్వాత విముక్తి...!
ఏపీలో రేషన్ బియ్యం పోర్టుల నుంచి అక్రమ రవాణా వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్న తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్లి పరిశీలించారు. అనంతరం అప్పటికే అధికారులు ఆపిన స్టెల్లా ఎల్ 1 షిప్ ను సీజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరికి కస్టమ్స్ అధికారులు 55 రోజుల విరామం తర్వాత ఈ విదేశీ నౌక కాకినాడ పోర్టును విడిచి వెళ్లేందుకు క్లియరెన్స్ ఇచ్చారు.
కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుందన్న కారణంతో పవన్ కళ్యాణ్ నవంబర్ లో స్టెల్లా ఎల్ 1 నౌకను సీజ్ చేయాలని కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి స్టెల్లా ఎల్ 1 నౌక కాకినాడ పోర్టులోనే ఉండిపోయింది. అయితే ఇలా సముద్ర జలాల్లో ఉన్న విదేశీ నౌకను సీజ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తేలడంతో దీన్ని ఏదో ఒక రోజు వదిలేయక తప్పని పరిస్ధితి. కానీ 55 రోజుల తర్వాతే దీన్ని విడుదల చేయాల్సి వస్తోంది.

పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని సీజ్ చేయాలనే ఆదేశాలు ఇచ్చాక స్టెల్లా ఎల్ 1 నౌక ను అంత సులువుగా వదిలేసేందుకు అధికారులు ఇష్టపడలేదు. అందులో రేషన్ బియ్యం తనిఖీ పేరుతో, వాతావరణం అనుకూలంగా లేదనే కారణంతో ఈ నౌకను వదలకుండా అధికారులు పట్టుబట్టారు. వెంటనే ఈ నౌకను వదిలేస్తే పవన్ కళ్యాణ్ కు కోపం వస్తుందనే దాన్ని ఇన్నాళ్లు కాకినాడ పోర్టులో ఉంచారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఎట్టకేలకు ఈ నౌకకు విముక్తి లభించింది.
ఇంతకీ స్టెల్లా ఎల్ 1 నౌకను వదిలేయడం వెనుక కూడా చాలా పరిణామాలు జరిగాయి. ముందుగా ఈ నౌక విషయంలో హైకోర్టుకు వెళ్లిన ప్రభుత్వం అందులో రేషన్ బియ్యం విషయంలో వాదనలు చేస్తున్న తరుణంలోనే కేంద్రం నుంచి దీన్ని వదిలేయాలనే ఆదేశాలు వచ్చాయి. ఆఫ్రికా దేశాలతో ఉన్న ఒప్పందం వల్లే ఇలా బియ్యం రవాణా చేస్తున్నట్లు కూడా తేల్చిచెప్పేసింది. ఇలా విదేశీ నౌకను అడ్డుకుంటే దేశాల మధ్య సంబంధాలపై కూడా ప్రభావం పడుతుందని కేంద్రం చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో 55 రోజుల తర్వాత స్టెల్లా ఎల్ 1కు క్లియరెన్స్ ఇచ్చి కస్టమ్స్ అధికారులు దాన్ని గమ్యానికి పంపుతున్నారు.
-
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
వాళ్లను వదలొద్దు- రఘురామ, పవన్ కళ్యాణ్ డిమాండ్..! -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications