అరవ శ్రీధర్ పై పవన్ సీరియస్-కల్తీ నెయ్యిపైనా నేతలకు క్లాస్..!

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంతో పాటు రాష్ట్రంలో తాజా పరిణామాలపై చర్చించేందుకు ఆ పార్టీ జనరల్ బాడీ ఇవాళ సమావేశమైంది. ఇందులో పవన్ కళ్యాణ్ (pawan kalyan), మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ తో పాటు ఇతర ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో అరవ శ్రీధర్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అలాగే ఈ వ్యవహారంపై పార్టీ నేతల స్పందన కూడా పేలవంగా ఉందని జనసేనాని ఫైర్ అయ్యారని సమాచారం.

అరవ శ్రీధర్ వ్యవహారంపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్.. అందరి చిట్టా తన దగ్గర ఉందన్నారు. అరవ శ్రీధర్ తో చిట్ చాట్ చేసిన వీడియోల్ని వీణ అనే మహిళ రెగ్యులర్ గా విడుదల చేస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ సమావేశం నుండి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. ఏం చేస్తారో రిపోర్ట్ ఇవ్వాలని నాదెండ్ల మనోహర్ కి చెప్పి పవన్ వెళ్ళిపోయారని సమాచారం.
అంతకు ముందు పార్టీ నేతల భేటీలో పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డూకు వాడిన నెయ్యి పై సిట్ రిపోర్ట్ ను కూడా ప్రస్తావించారు.

pawan kalyan serious over mla arava Sridhar s sexual harassment allegations Tirumala ghee report

లడ్డూ వ్యవహారంపై ఇంతా జరుగుతున్నా ఒక్కరూ మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఎందుకు తిప్పి కొట్టడం లేదని నేతల్ని ప్రశ్నించారు. అన్నింటికీ తానే మాట్లాడితే మీరు ఎమ్మెల్యే లు మంత్రులు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులుగా ఉన్నది ఎందుకని నిలదీశారు. వైసీపీ నేతల వ్యాఖ్యలపై అప్రమత్తంగా ఉండాలని, వాళ్ల ట్రాప్ లో పడొద్దని వారికి సూచించారు. మిమల్ని మీ కుటుంబ సభ్యులను ఇష్టంవచ్చినట్టు మాట్లాడతారు జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించారు. కానీ మీరు మాత్రం సిద్ధాంత పరంగా, సబ్జెక్ట్ పరంగా మాట్లాడాలన్నారు. వ్యక్తిగత వ్యవహారాలు విషయంలో జాగ్రత్తగా ఉండాలని, మీ వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని నేతల్ని పవన్ హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+