తమ్ముళ్లూ.. ఆధారాలు కావాలా? ఇవిగో చూస్కోండి: పవన్ అమరావతి ఇంటిపై జనసేన ట్వీట్

అమరావతి: జనసేన అధినేత, పవన్ స్టార్ పవన్ కళ్యాణ్‌ తనపై వస్తున్న విమర్శలను, ఆరోపణలను ధీటుగా ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. ఇటీవల గుంటూరు వేదికగా జరిగిన 'జనసేన ఆవిర్భావ సభ'లో అధికార టీడీపీపై నిప్పులు చెరగటంతో పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్ అయ్యారు పవన్. అప్పటి వరకూ మిత్రపక్షంగా ఉన్న టీడీపీ జనసేన పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలోనే అవినీతిలో అగ్రగామిగా ఉందని.. కంచే చేనును మేసే చందంగా అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తూన్నారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టే ప్రయత్నంలో టీడీపీ నాయకులు పవన్ అమరావతిలో నిర్మిస్తున్న కొత్త ఇంటిపై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

pawan-kalyan

అత్యంత ఖరీదైన అమరావతి ప్రాంతంలో పవన్ ఈ రెండెకరాల భూమిని అతి తక్కువ ధరకే కొన్నారనే విమర్శలు పెద్దఎత్తున వచ్చాయి. ఈ విమర్శలను తిప్పికొడుతూ.. జనసేన అధికారిక ట్విట్టర్ పేజ్‌లో ఆ స్థలం ఎప్పుడు కొన్నది? ఎంతకు కొన్నది? ఎవరి వద్ద కొన్నది వంటి పూర్తి వివరాలతో డాక్యుమెంట్స్‌ను ఆధారాలుగా చూపిస్తూ ట్వీట్ పెట్టింది జనసేన.

పవన్ కళ్యాణ్ కొన్న స్థలానికి వెల కట్టింది ఏపీ రిజిస్ట్రేషన్ శాఖ అని.. ఎకరం భూమికి రూ.20 లక్షలుగా ప్రభుత్వం వెల కట్టిందని, దాన్ని చెల్లించి అధికారికంగా రిజిస్ట్రేషన్ ఫీజులన్నీ చెల్లించే అక్కడ ఇళ్లు కడుతున్నట్టు అన్ని ఆధారాలను ట్వీట్‌లో పొందుపరిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+