జగన్ పగ తీర్చుకుంటున్నారు: చంద్రబాబు ముద్ర లేకుండా: పవన్..నాగబాబు ఆగ్రహం..!
ముఖ్యమంత్రి జగన్ పాలన పైన జనసేన అధినేత పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. జాతీయ పత్రికలో ప్రచురితమైన ఒక వ్యాసాన్ని తెలుగులోకి అనువదించి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసారు. రెండు రోజుల క్రితం ఇదే రకంగా ప్రచురితమైన ఒక క్యారికేచర్ ను పవన్ పోస్ట్ చేసారు. జగన్ పాలన పైన ఇదీ ఢిల్లీ మాట అంటూ కామెంట్ చేసారు. ఇదే తరహాలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం స్పందించారు. జాతీయ దినపత్రికలో వచ్చిన కధనాలను తన ట్విట్టర్ ఖాతాలో ప్రస్తావించారు. ఇప్పుడు పవన్..ఆ కధనాన్ని తెలుగులోకి అనువదించి..తన అభిప్రాయాలను రాసుకొచ్చారు. ఇక, ఇదే సమయంలో పార్టీ నేత.. మెగా బ్రదర్ సైతం జనసైనికుల మీద కేసులు పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ ఢిల్లీ మాట అంటూ..
ఏపీలో జగన్ పరిపాలన పగతీర్చుకునే విధంగా, సరైన కొలమానం లేకుండా సాగుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇది ఢిల్లీ మాట అంటూ... వైసీపీ ప్రభుత్వ పాలనపై ఇంగ్లిష్ పత్రికలు ఈ నెలలో రాసిన సంపాదకీయాలను ఆయన తెలుగులోకి అనువాదం చేసి ట్విటర్‌లో పోస్టు చేశారు. సీఎం జగన్‌వి తిరోగమన రాజకీయాలని, పరిపాలనలో ఆయనకు ఒక దృక్కోణం కావాలన్న శీర్షికలను కూడా పొందుపరిచారు. దేశంలోని యువ ముఖ్యమంత్రుల్లో ఒకరైన 47 ఏళ్ల జగన్‌రెడ్డి పరిపాలన భయాందోళన కలిగిస్తోందని వ్యాసంలో పేర్కొన్నారు. దీనిని పవన్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఇది ఢిల్లీ మాట అంటూ కామెంట్ చేసారు. . రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం జగన్ వెంటనే తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలి అంటూ పోస్ట్ చేసారు. దీని ద్వారా జగన్ పైన ఢిల్లీలో ఏ రకమైన అభిప్రాయం ఉందో అనే విధంగా పవన్ పోస్టింగ్ లు ఉన్నాయి.

చంద్రబాబు ఇదే వ్యాసాలను..
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం రెండు రోజుల క్రితం జాతీయ మీడియాలో ప్రచురితమైన ఇవే వ్యాసాలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారుజ పవన్ అదే రకంగా జగన్ పైన వచ్చిన కారికేచర్ ను సైతం ట్విట్టర్ లో జోడించారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయం నుండి తీసుకున్న నిర్ణయాలను తప్పు బడుతూ..ఇదంతా రాజకీయంగా కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగా ఆ వ్యాసాల్లో అభిప్రా యాలు వ్యక్తం చేసారు. వీటినే ఇప్పడు చంద్రబాబు..పవన్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. సీఎం జగన్‌వి తిరోగమన రాజకీయాలని, పరిపాలనలో ఆయనకు ఒక దృక్కోణం కావాలన్న శీర్షికలను కూడా పవన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీని ద్వారా ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా పవన్ తన రాజకీయ పోరాటం తీవ్రతరం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా కనిపిస్తోంది.

కేసులు పెడతారా..నాగబాబు సీరియస్
జనసేన పార్టీ కార్యకర్తలు..అభిమానుల మీద కేసులు పెడతారా అంటూ మెగా బ్రదర్ నాగబాబు సీరియస్ అయ్యారు. వైసీపీ ఎమ్మెల్యేలు అధికారం అడ్డుపెట్టుకొని జనసైనికుల మీద కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. ఇలాంటి చర్యలను చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రుస్తుంబాదలో జరిగిన జనసేన కార్తీక వనసమారాధనలో ఆయన పాల్గొన్నారు. జనసైనికులకు అండగా ఉంటామని స్పష్టం చేసారు. కార్యకర్తల మీద కేసులు నమోదు చేస్తున్నారంటూ కొందరు నేతలు నాగబాబుకు వివరించారు. దీంతో..ఆయన స్పందించారు. అయితే, పవన్.. నాగబాబు ఇద్దరూ ప్రభుత్వం మీద ఇక దాడి తీవ్రతరం చేయాలనే ఆలోచనతో ఉన్నారని..పార్టీ కార్యక్రమాలకే ఎక్కవ సమయం కేటాయిస్తారని జనసేన నేతలు చెబుతున్నారు.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications