ఓటుకు నోటు కేసుపై అడిగితే... చంద్రబాబును ఉతికి ఆరేసిన పవన్ కల్యాణ్

Posted By:
Subscribe to Oneindia Telugu

గుంటూరు: మీ మీద ఎన్ని అభియోగాలు వచ్చాయని పవన్ కల్యాణ్ చంద్రబాబును అడిగారని పవన్ కల్యాణ్ చెప్పారు. అది వచ్చినప్పుడు మీడియా ప్రతినిధులు తనను ప్రశ్నించారని, గుడ్డిగా చంద్రబాబును మద్దతు ఇస్తారని అడిగారని, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి చంద్రబాబుపై మాట్లాడలేదని అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి గురించి మీరు ఎన్ని కథనాలు రాశారని, ఆయనది తప్పేనని, తనా మద్దతు ఇవ్వడం లేదని, ఇసుక మాఫియాలో మీది తప్పు కాదా, ఎర్రచందనం విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అడిగారు.

చట్టప్రకారం జరిగేవి జరుగుతాయని ఆ రోజు కామ్ గా ఉన్నానని ఆయన అన్నారు మీ బుద్ధి మారలేదని, ఆలోచన మారలేదని, ఆశాభంగంం చేశారని ఆన చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. ఒక్కో తెలుగుదేశం పార్టీ ఎంతెంత సంపాదించాడని అన్నారు. ప్రమాదంలో గాయపడినవారిని దోచుకుంటారా, కన్నతల్లిని ఎవరైనా దోస్తారా, రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రాన్ని పసిబిడ్డలా, కన్నతల్లిలా చూడాలని, తెలుగుతల్లి శాపం మీకు కచ్చితంగా తగిలి తీరుతుందని అన్నారు.

వైసిపి వస్తే దోపిడీ అన్నారు..

వైసిపి వస్తే దోపిడీ అన్నారు..

వైసిపి నాయకులు అధికారం వస్తే దోపిడీ పెరుగతుందని అన్నారని పవన్ గుర్తు చేస్తూ మీరేం చేస్తున్నారని అడిగారు. తెలంగాణ భూకబ్జాలు ఉంటాయి గానీ ఇక్కడ తక్కువని, అయితే మీరు అది ప్రారంభించారే ఇక్కడ అని అన్నారు. తప్పుడు విధానాలు పుంఖానుపుంఖంగా వస్తూనే ఉన్నాయని అన్నారు.

 మన బంగారం మంచిదైతే కదా..

మన బంగారం మంచిదైతే కదా..

29 సార్లు ఢిల్లీకి వెళ్తే ఏం లాభం మన బంగారం మంచిది కావాలని అన్నారు. పోరాటానికి సిద్ధమవుతున్నామని అన్నారు. పోరాటం చేస్తే పోయేదేం ఉంది బానిస సంకెళ్లు తప్ప అని అన్నారు. భయపడుదామా అని ఒక్కటికి రెండు సార్లు అడిగారు. అవినీతి చాలా దూరం వెళ్లిపోయిందని అన్నారు. దుర్గ గుడి పార్కింగ్ వద్ద కూడా అవినీతి ఉందని అన్నారు. చాలా దురదృష్టకరమైన పరిస్థితులు ఉన్నారని అన్నారు. కనకదుర్గ తల్లిని కూడా వదిలిపెట్టలేదని అన్నారు.

కులాల మధ్య చిచ్చు పెట్టారు

కులాల మధ్య చిచ్చు పెట్టారు

మేధోమధనం జరగాలని, మేధావుల సలహాలు తీసుకుని, అన్ని వర్గాల యోగక్షేమాలు దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతానని చెప్పారు. తాను 32 కులాలకు అండగా ఉంటానని చెప్పారు. ప్రభుత్వ విధానాలతో సంఘంలో గొడవలు వస్తున్నాయని అన్నారు. ఎస్టీలకు, మత్స్యకారులకు గొడవ పెట్టారని ఆయన చంద్రబాబును విమర్సించారు. కాపు రిజర్వేషన్ల అమలు సాధ్యాసాధ్యాలను ఆలోచించరా అని అడిగారు అది సాధ్యమయ్యేది కాదని తెలిసి హామీ ఇచ్చారని, కాపులకు బీసీలకు గొడవ పెట్టారని ఆయన అన్నారు. కులాల మధ్య ప్రభుత్వం చిచ్చు పెట్టిందని అన్నారు. వోటు బ్యాంక్ అంటారని, మీరు నాకు కుటుంబమని, ప్రజలను కుటుంబంగా చూడలాలని అన్నారు. ప్రాణంగా చూసుకోవాలని అన్నారు.

ఆగస్టు 15వ తేదీన మానిఫెస్టో

ఆగస్టు 15వ తేదీన మానిఫెస్టో

ఆగస్టు 15వ తేదీన పార్టీ మానిఫెస్టో విడుదల చేస్తానని ఆయన చెప్పారు. దాన్ని బట్టి అది ఎలా ఉంటుందో చూసుకోవచ్చునని అన్నారు. వదిలేస్తే రైతును అయ్యేవాడినేమో, భగవంతుడు ఇంత మంది అభిమానాన్ని ఇచ్చారని, ప్రఖ్యాతులూ డబ్బు ఇచ్చింది తన కోసం కాదని, అందుకే తనకు సుఖం లేదని, విదేశాల్లో ఉన్నా, హోటల్లో ఉన్నా తప్పు చేసినట్లు ఉంటుందని అన్నారు.

 మీకోసమే పవన్ గుండె కొట్టుకుంటుంది..

మీకోసమే పవన్ గుండె కొట్టుకుంటుంది..

ఎక్కడున్నా పవన్ కల్యాణ్ గుండె మీకోసం కొట్టుకుంటుందని అన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా తన హృదయం స్పందిస్తుందని అన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లో పనిచేస్తున్నానని అంటున్నారని, ఇప్పుడు చెప్పండి ఇప్పుడు అలా అనిపిస్తోందని అన్నారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి చెప్పాలని అన్నారు. సత్యావిష్కరణ అంటే సంపూర్ణంగా ఉండాలని అన్నారు.

నేను శిక్ష వేసుకుంటా..

నేను శిక్ష వేసుకుంటా..

అధికార, ప్రతిపక్ష నాయకులు చేసే మంచి పనులూ ఉంటాయి, చెడు పనులూ ఉంటాయని పవన్ అన్నారు. పవన్ కల్యాణ్ చేసే మంచి పనులు ఉంటాయి, చేయలేని పనులూ ఉంటాయని అన్నారు తాను తప్పు చేస్తే తనకు తాను బలమైన శిక్ష విధించుకుంటానని అన్నారు. అవిశ్వాసం పెట్టాలని అడిగడానికి ఒక్క రోజు చర్చకు వస్తుంందని అన్నారు. బడ్జెట్‌ను గంటలో కానిచ్చేశారని, జగన్ పెట్టే అవిశ్వాసం ఓ లెక్కా అని అన్నారు.

విజయసాయి రెడ్డికి ప్రధాని అపాయింట్‌మెంట్

విజయసాయి రెడ్డికి ప్రధాని అపాయింట్‌మెంట్

చంద్రబాబు తనకు ప్రధాని అపాయంట్‌మెంట్ ఇవ్వలేదని అంటున్నారని పవన్ చెబుతూ విజయసాయిరెడ్డికి అపాయింట్ మెంట్ ఎందుకిస్తారని, ముందే బయటపడితే మీకు ఓట్లు వేసే ప్రజలు దూరమవుతారని అనుకుంటున్నారా అని అడిగారు. ఓటు బ్యాంక్ రాజకీయాలంటే అసహ్యమని అన్నారు. ప్రతి ఒక్కరినీ తనతో పాటు నిశితింగా పరిశీలించాలని అన్నారు. ఒక్కో నియోజకవర్గానికి పది కోట్లు ఖర్చు చేస్తున్నారంటే మీ జేబులోంచి, కంపెనీలోంచి తీస్తున్నారా అని అడిగారు.

సింగపూర్ తరహా అంటే..

సింగపూర్ తరహా అంటే..

సింగపూర్ తరహా రాజధాని ఎత్తయిన భవనాలు కాదని, ఉన్నతమైన ఆశయాలని అన్నారు. డబ్బులు తీసుకోవాలని, వారిన నమ్మించాలని అన్నారు. డబ్బులు తీసుకుని ఓట్లేయకపోతే బాగుండదని అనుకోకండని అన్నారు. మీరేం భయపడవద్దని అన్నారు. మత పెద్దలతో మాట్లాడి డబ్బులు తీసుకోవాలని, జేబుల్లో పెట్టుకోవాలని అన్నారు. ఓటు మాత్రం జనసేనకు వేయాలని ఆయన అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jana Sena chief Pawan Kalyan lashed out at Andhra Pradesh CM Nara Chnadrababu naidu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి