పవన్ కల్యాణ్ వ్యూహం: మహేష్ కత్తిపై అనుమానాలు ఇవీ...

Posted By:
Subscribe to Oneindia Telugu
  పవన్ కల్యాణ్‌పై పోటీ చేస్తా : నడిరోడ్డు మీద కాల్చి చంపినా తప్పులేదు పై మహేష్ కత్తి !

  హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్, నటి పూనం కౌర్‌కు మద్య సంబంధాలపై అనుమానాలు రేకెత్తించే విధంగా మహేష్ కత్తి తీవ్రమైన ఆరోపణలు చేయడం తీవ్ర సంచలనం రేపింది. మహేష్ కత్తి అంత దూరం వెళ్లడం వెనక పనిచేస్తున్న శక్తులేమిటనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

  తన వెనక ఎవరూ లేరని మహేష్ కత్తి పదే పదే చెబుతున్నప్పటికీ నమ్మడానికి ఇప్పుడు ఎవరూ సిద్ధంగా లేరు. పవన్ కల్యాణ్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రావడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న సమయంలో వ్యూహాత్మకంగానే మహేష్ కత్తి మీడియా ముందుకు వచ్చారని అంటున్నారు.

   మహేష్ కత్తి వ్యవహారంపై చర్చ

  మహేష్ కత్తి వ్యవహారంపై చర్చ

  మహేష్ కత్తి పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకోకూడదని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ కత్తి వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ పోతే ప్రధాన లక్ష్యం దెబ్బ తింటుందనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. ఈ స్థతిలో జనసేన కీలకమైన నిర్ణయం తీసుకుందని అంటున్నారు. జనసేన పార్టీకి సంబంధించిన కొంత మంది నేతలు ఆదివారం పవన్‌ను కలిసి కత్తి మహేశ్ వ్యవహారంపై చర్చించినట్లు సమాచారం.

  మహేష్ కత్తిపై పవన్ కల్యాణ్ వ్యూహం ఇదీ...

  మహేష్ కత్తిపై పవన్ కల్యాణ్ వ్యూహం ఇదీ...

  మహేష్ కత్తి ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని జనసేన నాయకులు నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ కూడా అదే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. మహేష్ కత్తి ఆరోపణలపై స్పందించవద్దని పార్టీ శ్రేణులకు, అభిమానులకు పవన్ కల్యాణ్ సందేశం పంపినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై సరైన సమయంలో, తగిన రీతిలో పవన్ కల్యాణ్ స్పందిస్తారని అంటున్నారు.

   వెనక జగన్ ఉన్నారని....

  వెనక జగన్ ఉన్నారని....

  మహేష్ కత్తి వెనక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కల్యాణ్ అభిమానుల నుంచీ పార్టీ వర్గాల నుంచే కాదు, ఇతర వర్గాల నుంచి కూడా ఆ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే, ఆదివారంనాడు మీడియా ప్రతినిధులు - చంద్రబాబుని నడిరోడ్డు మీద కాల్చేసినా తప్పు లేదని జగన్ చేసిన వ్యాఖ్యను ప్రస్తావించారు. ఆయన ఇచ్చే సమాదానంలో ఆ విషయం ఏమైనా బయటపడుతుందేమోననే ఉద్దేశంతో ఆ ప్రశ్న వేశారు. అయితే, మహేష్ కత్తి తెలివిగా సమాధానమిస్తూ తాను ఖండించానన, ఆ మాట ఎవరన్నా తప్పేనని, జగన్ అన్నా తప్పేనని అన్నారు.

   మహేష్ కత్తిపై మరో అనుమానం...

  మహేష్ కత్తిపై మరో అనుమానం...

  పవన్ కల్యాణ్ సామాజికంగా, పేరు ప్రతిష్టల దృష్ట్యా ఉన్నత స్థాయిలో ఉన్నారు. సినిమాల్లో ఎనలేని అభిమాన సంపద ఆయనకు ఉంది. పైగా, రాజకీయాల్లో ఆయన అడుగు పెడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ నరసింహన్ వంటివారితో సాన్నిహిత్యం ఉంది. అటువంటి ఉన్నత స్థాయిలో ఉన్న పవన్ కల్యాణ్‌పై ఆరోపణలు, విమర్శలు చేయడం ద్వారా మహేష్ కత్తి ప్రచారం పొందాలని అనుకుంటున్నారనేది రెండో అనుమానం. నిజానికి, మహేష్ కత్తికి బిగ్ బాస్ కొంత ఇమేజ్‌ను ఇస్తే, ఎక్కువ ఇమేజ్ పవన్ కల్యాణ్ అభిమానుల చర్యలవల్లనే వచ్చింది.

   పవన్ కల్యాణ్ ఒక్క మాట చెప్పి ఉంటే...

  పవన్ కల్యాణ్ ఒక్క మాట చెప్పి ఉంటే...

  మహేష్ కత్తిని పట్టించుకోవద్దని, ఆయనపై వ్యాఖ్యలు చేయవద్దని నేరుగా పవన్ కల్యాణ్ ప్రకటన ఇచ్చి ఉంటే సరిపోయేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్ కల్యాణ్ కాకున్నా ఆయన తరఫున ఆయన అభిమాన సంఘాల నాయకులు ఫ్యాన్స్‌కు సూచన చేసినా బహుశా మహేష్ కత్తి ఇంత దూరం రావడానికి అవకాశం ఉండేది కాదు. ఫ్యాన్స్ అదుపు తప్పినప్పుడు తెలుగు హీరోలు వారిని శాంతపరచడానికి ప్రకటనలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. పవన్ కల్యాణ్ అభిమానులు మహేష్ కత్తిని ఆయన మానానికి ఆయనను వదిలేసి ఉంటే, ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఆయన ఇంత వివాదాన్ని ముందుకు తెచ్చే అవకాశం కూడా ఉండేది కాదు. రెండు చేతులు కలిసినప్పుడే చప్పుడవుతుందనే విషయాన్ని చాలా మంది ఈ సమయంలో గుర్తు చేస్తున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  It is said that Jana Sena chief Pawan kalyan has decided to ignore Mahesh Kathi.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి