గంజాయి అంతానికి పటిష్ట చట్టం తీసుకురండి; ఆ యువతకు ఉపాధి చూపండి: జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి సాగు పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ యువత పైన మాదకద్రవ్యాల ప్రభావం ఎక్కువగా ఉందని పేర్కొన్న పవన్ కళ్యాణ్, గంజాయి సాగు నిజంగా సామాజిక-ఆర్థిక అంశం అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. విశాఖ మన్యం నుంచి తుని వరకు ఉపాధి లేని చదువు పూర్తయిన కుర్రాళ్లు చాలామంది గంజాయి వ్యాపారంలో చిక్కుకుంటున్నారని కింగ్ పిన్స్ మాత్రం రిస్క్ లేకుండా సంపాదిస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

వైసీపీ ప్రభుత్వం గంజాయి ముప్పును అరికట్టాలి
ఇక తాజాగా మరోమారు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం ఈ ముప్పును అరికట్టాలని సూచించారు. వేలకోట్ల గంజాయి వ్యాపారాన్ని అంతమొందించడానికి ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకు రావాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 2018 నుండి ఆంధ్రప్రదేశ్ యువతపైన మాదకద్రవ్యాల ప్రభావం గురించి పవన్ కళ్యాణ్ చెబుతూనే ఉన్నారని అది ఇప్పుడు తారా స్థాయికి చేరిందని, నాటి వీడియోను పోస్ట్ చేసి అందరికీ గుర్తు చేశారు.

వేలకోట్ల గంజాయి వ్యాపారాన్నిఅంతం చెయ్యటానికి పటిష్టమైన చట్టం
ఆంధ్రా ఒరిస్సా సరిహద్దులో 'గంజాయి స్మగ్లింగ్' సామాజిక-ఆర్థిక సమస్యగా చూడాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్య అకస్మాత్తుగా తలెత్తలేదని ఇది 15-20 ఏళ్లుగా ఉందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తాను 2018 నుండి ఈ అంశాన్ని హైలైట్ చేస్తున్నాను అంటూ పేర్కొన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుత వైసీపీ పాలనలో గంజాయి స్మగ్లింగ్ మరింత ఎక్కువైందని వ్యాఖ్యానించారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం గంజాయి ముప్పును అరికట్టాలని తాను కోరుతున్నానని పేర్కొన్న పవన్ కళ్యాణ్ ఈ వేల కోట్ల విలువైన గంజాయి వ్యాపారాన్ని అంతం చేయడానికి పటిష్టమైన చట్టాన్ని అమలు చేయడంతో పాటుగా సమాన ఉపాధి అవకాశాలను యువతకు కల్పిస్తూ సమాంతరంగా పని చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

సమస్య మూలాలలోకి వెళ్లి పరిష్కరించాలని చెప్తున్న పవన్ కళ్యాణ్
అప్పుడే ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి దందాను అరికట్టడానికి వీలవుతుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మొన్నటికి మొన్న గంజాయిని సాగు చేస్తున్న క్షేత్రాలపై దాడులు చేసి వాటిని నాశనం చేయడం ద్వారా గంజాయికి అడ్డుకట్ట వేయవచ్చని పేర్కొన్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఈ సమస్యను సామాజిక ఆర్థిక సమస్యగా పేర్కొని అక్కడ యువత బతుకులు బాగు చేయడానికి ప్రత్యామ్నాయంగా ఉపాధి అవకాశాలను కల్పించాలని సూచిస్తున్నారు. లేదంటే కేసులు నమోదు చేసినా, జైలుకు పంపినా తిరిగొచ్చిన తర్వాత మళ్లీ అదే పని చేస్తారంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. సమస్యను మూలాల్లోకి వెళ్ళి పరిష్కరించగలిగినప్పుడే ఈ సమస్య పునరావృతం కాదు అన్న సంకేతాన్ని పవన్ కళ్యాణ్ తన పోస్టు ద్వారా అర్థమయ్యేలా చెప్పారు .

దేశంలో గంజాయి కేసులు ఎక్కడ నమోదైనా సరే ఏపీలోనే మూలాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాదకద్రవ్యాల హబ్ గా మారిందని ఆవేదన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ వివిధ రాష్ట్రాల్లో దొరుకుతున్న గంజాయి అంతా ఏపీ నుండే అక్రమ రవాణా జరిగిందని అధికారుల ప్రెస్ మీట్ ల వీడియో లను పోస్ట్ చేసి మరీ వెల్లడించారు. కర్ణాటక, కేరళ , మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ , రాజస్థాన్ లోనూ, అల్లాగే దేశ రాజధాని ఢిల్లీ లోనూ గంజాయి గుప్పు ఏపీదే అని పవన్ కళ్యాణ్ ఆధారాలతో సహా పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. మొదటి నుండి ఇది ఒక సామాజిక ఆర్ధిక అంశం అని పదేపదే చెప్తున్న పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి గంజాయిని అరికట్టటం కోసం తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తున్నారు.

యువత భవిష్యత్ పై పవన్ కళ్యాణ్ ఆందోళన .. అందుకే వైసీపీ ప్రభుత్వానికి సూచన
మన్యంలో ఇప్పుడు గంజాయి పంట ముఖ్య దశలో ఉందని నవంబరు, డిసెంబరు నెల నుంచి పంట కోత మొదలవుతుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అప్పుడు గంజాయి దందా ఎక్కువగా జరిగే అవకాశం ఉందన్నారు. గతంలో గంజాయిని పోలీసులు, ఆబ్కారి అధికారులు ధ్వంసం చేసే వారని, ఇప్పుడు రవాణా అవుతున్న గంజాయిని మాత్రమే పట్టుకుంటే లాభం లేదని వెల్లడించారు. ఈ నేపధ్యంలోనే పవన్ కళ్యాణ్ తాజా సూచనలు చేశారు. యువత భవితకు ఉపాధి బాట వేసి, గంజాయి సాగుకు చెక్ పెట్టాలని చెప్తున్నారు.
-
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications