వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ దారిలోకి.. టాలీవుడ్ సూపర్ స్టార్లు: మహేష్ బాబుపై ట్విస్ట్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తికి పలువురు టాలీవుడ్ ప్రముఖులు ముందుకు వస్తున్నారు! సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ఎన్నారైలు తలా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని, వాటిని అభివృద్ధి చేయాలని కోరిన విషయం తెలిసిందే. మోడీ సూచించిన దీనికి అందరి నుండి మంచి స్పందన వస్తోంది. గ్రామాల దత్తతతో పాటు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పలువురు పాల్గొంటున్నారు.

స్వచ్ఛ భారత్‌తో పాటు గ్రామాలను కూడా పలువురు దత్తత తీసుకుంటున్నారు. మాజీ కేంద్రమంత్రి చిరంజీవి, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్... ఇలా ఎందరో ఆయా గ్రామాలను దత్తత తీసుకున్నారు. మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ వంటి జాతీయ ప్రముఖులు కూడా గ్రామాలను దత్తత తీసుకున్నారు.

తాజాగా, సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మోడీ స్కీములో చేరుతున్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ గ్రామాన్ని దత్తత తీసుకోనప్పటికీ.. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలోని రాజాం పర్యటనలో మోడీ స్వచ్ఛ భారత్‌లో పాల్గొనాలని అందరికీ పిలుపునిచ్చారు. మోడీ గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛ భారత్ ప్రారంభించారు. బీజేపీకి అండగా నిలిచిన పవన్.. స్వచ్ఛ భారత్‌లో ఎప్పుడు పాల్గొంటారా అనే ఉత్కంఠ ఇటీవలి వరకు కొనసాగింది.

pawan kalyan swachh bharat, Mahesh Babu to adopt ancestral village

కొద్ది రోజుల క్రితం నుండి పవన్ స్వచ్ఛ భారత్‌లో పాల్గొని, అభిమానులకు కూడా పిలుపునిచ్చారు. మోడీ పిలుపు మేరకు పవన్ గ్రామాన్ని దత్తత తీసుకుంటారా చూడాలి. మరో టాప్ హీరో మహేష్ బాబు తన తండ్రి కృష్ణ జన్మించిన బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకోనున్నారంటున్నారు. ఇది గుంటూరు జిల్లాలో ఉంది.

ఈ విషయాన్ని స్వయంగా ఆయన బావ, తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ చెప్పారు. బుర్రిపాలెం గ్రామాన్ని మహేష్ బాబు స్మార్ట్ విలేజ్‌గా చేస్తారని చెప్పారు. ఎన్నికలకు ముందే మహేష్ బాబు, తాను దీనిపై చర్చించినట్లు జయదేవ్ చెప్పారు. కృష్ణ కుటుంబ సభ్యులు తరుచూ బుర్రిపాలెం వెళ్లి వస్తుంటారు. 1979లో కృష్ణ హీరోగా బుర్రిపాలెం బుల్లోడు చిత్రం కూడా వచ్చింది.

మహేష్ బాబు బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుంటారనే విషయమై ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ స్పందించినట్లుగా తెలుస్తోంది. దీని గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తాను ఈ విషయం గురించి ఏం మాట్లాడనని, మరికొన్నింటిని తాము ఫైనలైజ్ చేయాల్సి ఉందని చెప్పినట్లుగా సమాచారం.

English summary
Prime Minister Narendra Modi has also suggested NRIs and other rich businessmen to adopt villages in India so that it would be easier for the government to develop villages.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X