రివర్స్ గేర్ వెనుక..!: మోడీని వదిలేసి.. చివర్లో రూటుమార్చిన పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చివరి రోజ రూటు మార్చారా? అంటే అవుననే అంటున్నారు.
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చివరి రోజ రూటు మార్చారా? అంటే అవుననే అంటున్నారు. గోవధ, రోహిత్ వేముల ఆత్మహత్య, దేశభక్తి, నోట్ల రద్దు, ప్రత్యేక హోదా.. ఐదు అంశాలపై రోజుకొక దాని పైన ఆయన స్పందించారు.
తొలి నాలుగు రోజులు గోవధ, రోహిత్ ఆత్మహత్య, ప్రత్యేక హోదా, దేశభక్తి అంశాలపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ పైన నిప్పులు చెరిగారు. ప్రతి విషయంలోను బీజేపీని సూటిగా ప్రశ్నించి, సవాల్ విసిరారు.
అయితే, ఐదో అంశమైన నోట్ల రద్దు పైన ఆయన ఓ రోజు గ్యాప్ తీసుకున్నారు. ఆ మరుసటి రోజు స్పందించిన పవన్.. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ (ఆర్బీఐ) ఉర్జీత్ పటేల్ పైన నిప్పులు చెరిగారు. నోట్ల రద్దు అంశం రిజర్వ్ బ్యాంక్ పరిధిలోనిదే.

మోడీని వదిలి ఉర్జీత్‌ను టార్గెట్ చేసిన పవన్
అయినప్పటికీ నోట్ల రద్దు ప్రకటనను ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 8వ తేదీన చేశారు. ఈ అంశంపై విపక్షాలన్ని ప్రధానంగా మోడీనే టార్గెట్ చేస్తున్నాయి. ఉర్జీత్‌ను కూడా కొంత విమర్శిస్తున్నప్పటికీ ముఖ్యంగా ఆయనను ఉత్సవ విగ్రహంగా చూస్తున్నాయి.
ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ నోట్ల రద్దు అంశంపై పూర్తిగా ఉర్జీత్ పటేల్‌ను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

సవాళ్ల పైన సవాళ్లు
తొలి రోజు గోవధ పైన పవన్ స్పందించారు. అసలు బీజేపీ పాలిత రాష్ట్రాలలో గోవధ ఉందా అని నిలదీశారు. గోవు పైన ప్రేమ ఉంటే.. తాను సూచించినట్లు ప్రతి బీజేపీ కార్యకర్త ఓ గోవును ఎందుకు పెంచుకోవడం లేదని ప్రశ్నించారు.

వదిలేది లేదన్నారు
ఆ తర్వాత రోహిత్ వేముల, దేశభక్తి, ప్రత్యేక హోదా అంశాల పైన కూడా తీవ్రంగానే స్పందించారు. అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహిగా ముద్రవేయవద్దని నిప్పులు చెరిగారు. సినిమా హాళ్లలో జాతీయ గీతం కావాలంటున్న వారు.. రాజకీయ పార్టీల సమావేశాలలో జనగనమణను ఎందుకు తప్పనిసరి చేయడం లేదని ప్రశ్నించారు. హోదా పైన బీజేపీని వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు.

ఐదో రోజు విరామం
వరుసగా నాలుగు రోజుల పాటు నాలుగు అంశాల పైన మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ఐదో రోజు విరామం తీసుకున్నారు. ఆ మరుసటి రోజు నోట్ల రద్దు పైన స్పందించారు.

మోడీని ఏకిపారేస్తారనుకుంటే..
పవన్ కళ్యాణ్ తొలుత నోట్ల రద్దుకు మద్దతు ప్రకటించారు. నోట్ల రద్దును ప్రకటించిన పది రోజుల తర్వాత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ మోడీ ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నోట్ల రద్దు విషయంలో మోడీని ఏకిపారేస్తారని అందరూ భావించారు. కానీ ఆయన ప్రధానంగా ఉర్జీత్ పటేల్‌ను టార్గెట్ చేసుకున్నారు.

ఉర్జీత్ టార్గెట్
కర్నూలులో బాలరాజు సహా దేశంలో జరిగిన మృతులన్నింటికీ ఉర్జీత్ పటేల్ కారణమని ఆరోపించారు. నోట్ల రద్దుతో తమ బ్యాంకులలో కోట్లాది రూపాయలు జమ అయ్యాయని ఉర్జీత్ పటేల్ గంతులేస్తుండవచ్చునని, కానీ సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.

రివర్స్ గేర్ వెనుక..!
మొదటి నాలుగు రోజులు బీజేపీ పైన తీవ్ర విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్ చివరి రోజు నోట్ల రద్దు పైన ఉర్జీత్ పటేల్‌నే టార్గెట్ చేసుకోవడం ఏమిటనే చర్చ సాగుతోంది. నోట్ల రద్దు రిజర్వ్ బ్యాంకుకు సంబంధించిన అంశమే అయినప్పటికీ.. మోడీ పాత్రనే ఎక్కువగా ఉందనేది తెలుస్తోంది. కానీ ఆయన బీజేపీని కనీస స్థాయిలోను విమర్శించక పోవడం గమనార్హం.

మోడీకి తగిలినట్లే!
మరోవైపు, పవన్ కళ్యాణ్ నోట్ల రద్దు పైన ఉర్జీత్ పటేల్‌ను టార్గెట్ చేసినప్పటికీ ఆ మాటలు ప్రధాని నరేంద్ర మోడీకీ, బీజేపీకి తగిలినట్లేనని అంటున్నారు. నోట్ల రద్దు అంశం ఆర్బీఐ పరిధిలోనిది కాబట్టి, పవన్ ప్లాన్‌తో ఈ విషయంలో మోడీని కాకుండా ఉర్జీత్‌ను టార్గెట్ చేశారని అంటున్నారు. అంతకుముందు నాలుగు అంశాలపై బీజేపీని టార్గెట్ చేసినప్పటికీ, నోట్ల రద్దు విషయంలో మాత్రం ఆలోచించి ఆర్బీఐని టార్గెట్ చేసి ఉంటారని అంటున్నారు.
-
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!!












Click it and Unblock the Notifications