33మంది జలసమాధి; అన్నమయ్య డ్యాం విషాదఘటన గుర్తుచేసి.. ఘాటుగా పవన్ కళ్యాణ్

ఇటీవల సోషల్ మీడియా వేదికగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పంచ్ లు వేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని టార్గెట్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న పాపం పసివాడు సినిమాని మరోసారి సీఎం జగన్ తో తీస్తారని ఆశిస్తున్నా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెటైర్ వేసిన విషయం తెలిసిందే.

తాజాగా దేశంలోనే అత్యంత ధనవంతుడైన ఐదు కోట్ల విలువచేసే సీఎం అంటూ జగన్మోహన్ రెడ్డి ని టార్గెట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ 2021 లో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసి, జగన్ ఏం చేశారో చెప్పాలంటూ టార్గెట్ చేశారు. 19.11. 2021న తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు ఎన్నడూ రానంత వరద 3,20,000 క్యూసెక్కులు రావడంతో సుమారు 5.30 నిమిషాలకు అన్నమయ్య డ్యామ్ మట్టికట్ట తెగిపోయిందన్నారు.

 pawan

హఠాత్తుగా సంభవించిన ఈ వరద వల్ల చేయరు నది ఒడ్డున ఉన్న మందపల్లి, తొగురు పేట, పులపతూరు, గుండ్రులూ గ్రామాలలోని 33 మంది ప్రజలు జలసమాధి అయ్యారని నాటి విషాద ఘటనను గుర్తు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇక అన్నమయ్య డ్యాము ను తిరిగి పూర్తిస్థాయిలో పునర్నిర్మాణం చేసి ఒక ఏడాదిలోగానే ఆయకట్టు రైతుల ప్రయోజనాలు రక్షిస్తామని అప్పుడు ఏపీ ప్రభుత్వం ఘనంగా ప్రకటించిందన్నారు.

దుర్ఘటన జరిగి నేటికి 18నెలలు అవుతున్నా దానిని పట్టించుకున్న నాథుడే లేడని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తి దేవుడికెరుక కనీసం ఈరోజుకి వీసమెత్తు పనులు కూడా జరగలేదని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ 18నెలల్లో సాధించింది ఏంటయ్యా అంటే అస్మదీయుడు పొంగులేటి 3.94% అదనపు ప్రయోజనంతో రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి పనిని 660కోట్లకు అప్పజెప్పారు అంటూ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.

 pawan

దీనిపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్ గారు రాజ్యసభలో ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా చెప్పారని అంతర్జాతీయంగా ఈ ఘటన మీద అధ్యయనం జరిగితే మన దేశ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని వాపోయారు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రమాద ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన అసెంబ్లీలో చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఓ హైలెవల్ కమిటీ వేస్తున్నామని చెప్పారు.

ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఘనంగా ప్రకటించారని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కమిటీ ఏమైందో ఏమి సూచనలు చేశారో, రాష్ట్రంలోని మిగతా డ్యాముల వద్ద ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా వారు ఏం సూచనలు చేశారో.. ఏపీ సీఎం జగన్ ఏం చర్యలు తీసుకున్నారో.. ఆ దేవుడికే ఎరుక అంటూ సోషల్ మీడియా వేదికగా పవన్ ఏపీ సీఎం జగన్ ని టార్గెట్ చేశారు.

అంతేకాదు కార్ల్ మార్క్స్ లా క్లాస్ వార్ అంటూ పదేపదే మాట్లాడుతున్న జగన్ మోహన్ రెడ్డి ఆయనే అణచివేతకు పాల్పడుతూ అణచివేతకు గురవుతున్నట్లుగా మాట్లాడుతున్నారని ఇదే అన్నిటికంటే ఫన్నీవిషయమని అన్నమయ్య డ్యామ్ కు సంబంధించిన పూర్తి డేటాతో ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+