అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బలవంతంగా వద్దు: చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ మరో ఝలక్, టిడిపి ఏం చేస్తుంది?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం నాడు ఏపీ రాజధాని అమరావతి కోసం భూసేకరణ అంశంపై మరోసారి స్పందించారు. ఆయన ట్విట్టర్ ద్వారా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఝలక్ ఇచ్చారు.

గతంలో ప్రత్యేక హోదా పైన పవన్ ఆచితూచి స్పందించారు. భూసేరణ విషయమై రాజధాని ప్రాంతంలో పర్యటించి, రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు భూసేకరణ పైన సూటిగా ప్రశ్నించడం చర్చనీయాంశమైంది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం అమరావతి పరిసర ప్రాంతాల్లోని భూసమీకరణకు అంగీకరించని వారి భూములను భూసేకరణ చట్టం ప్రయోగించి సేకరించరని ఆశిస్తున్నానని చంద్రబాబు ప్రభుత్వానికి సూచించారు.

 Pawan Kalyan tells Telugudesam not to acquire land

సామరస్య పూర్వక వాతావరణంలో అక్కడి వారి సమస్యలు పరిష్కరించి, వారిని ఒప్పించి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం భూసేకరణ చేపడుతుందని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు. రైతులను ఒప్పించి భూసేకరణ చేయాలని పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెబుతున్నారు.

బలవంతంగా భూమిని సేకరించవద్దని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. నాడు పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతంలో పర్యటించినప్పుడు అనూహ్య స్పందన వచ్చింది. ప్రభుత్వం తమ భూమిని బలవంతంగా తీసుకుంటే తాము ఊరుకోమని రైతులు చెప్పగా.. పవన్ కూడా, తాను రైతులకు అండగా ఉంటానని ప్రకటించారు.

అయితే, ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ టిడిపిని ఇరుకున పెట్టేలా ట్వీట్లు చేస్తున్నారు. గతంలో భూసేకరణ పైన ట్వీట్లు చేయడంతో పాటు గుంటూరు ప్రాంతంలో పర్యటించారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా గురించి టిడిపి ఎంపీలపై మండిపడ్డారు. దానిపై టిడిపి ఎంపీలు కూడా ఘాటుగానే స్పందించారు. ఇప్పుడు పవన్ వ్యాఖ్యలకు వారు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

English summary
In what could be seen as a sequel to his tweets several months ago, Jana Sena Chief Powerstar Pawan Kalyan has once again expressed his dissent over the AP government's plans to acquire the farmers' lands in the capital region.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X