• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అమరావతిపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన.. దేశం నలుమూలలా వ్యాపించేలా.. కేంద్రంపైనా జనసేన పోరాటం?

|

ఏపీ రాజధాని అమరావతిలోనే కొనసాగేలా చూస్తామని, ఆ మేరకు కేంద్రాన్ని కూడా ఒప్పిస్తామంటూ ప్రాంతీయ పార్టీల అధినేతలు చేస్తున్న ప్రకటనల్ని ప్రజలు నమ్మొద్దంటూ బీజేపీ హెచ్చరికలు చేసిన గంటల వ్యవధిలోనే మిత్రపక్షం జనసేన పరోక్షంగా స్పందించింది. రాజధాని తరలింపుపై సీఎం జగన్ తీసుకోబోయే నిర్ణయాన్ని కేంద్రం తప్పక ఆమోదిస్తుందని బీజేపీ ప్రకటించగా.. అదే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న పోరాటానికి తాము మద్దతు కొనసాగిస్తామంటూ జనసేన స్పష్టం చేసింది. ఈ మేరకు పవన్ కల్యాణ్ బుధవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.

క్షేత్రస్థాయి పోరాటానికి..

క్షేత్రస్థాయి పోరాటానికి..

ఏపీకి అమరావతే శాశ్వతరాజధానిగా ఉండేలా చేస్తానని రైతులకు మాటిచ్చిన జనసేనాని పవన్ కల్యాణ్.. ఆ మాటకు కట్టుబడతాననీ, సినిమాలు, ఇతర కారణాల వల్ల ఆందోళనల్లో రెగ్యులర్ గా పాలుపంచుకోలేనీ చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, సేవ్ అమరావతి ఉద్యమకార్యాచరణకు సంబంధించి బుధవారం ఆయన కీలక ప్రకటన చేశారు. ఈనెల 10 తర్వాత నుంచి క్షేత్రస్థాయి పోరాటంలో పాలుపంచుకోనున్నట్లు చెప్పారు.

పవన్ ఏం చెప్పారంటే..

పవన్ ఏం చెప్పారంటే..

ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి తరలించొద్దంటూ జరుగుతోన్న పోరాటానికి జనసేన ఎప్పటికీ మద్దతు పలుకుతుందని, అందుకోసం ఎంతవరకైనా పోరాడుతామని పవన్ కల్యాణ్ తెలిపారు. అమరావతి కోసం రైతులు, ఆడపడుచులు గత 50 రోజులుగా నిరాహార దీక్షలు, ఆందోళనలు చేస్తూ.. పట్టుసడలించకుండా శాంతియుత పంథాలో ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తున్న తీరుకు తెలుగువాళ్లంతా గర్విస్తున్నారని కొనియాడారు.

ఈనెల 10 తర్వాత రంగంలోకి..

ఈనెల 10 తర్వాత రంగంలోకి..

‘‘అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం వేల మంది రైతులు నిస్వార్థంగా 33వేల ఎకరాల భూమిని ఆనాటి ప్రభుత్వానికి సమర్పించుకున్నారు. తర్వాత ఏర్పడిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇప్పుడా రైతులు రోడ్డునపడే పరిస్థితి వచ్చింది. రైతన్నలకు జనసేన పార్టీ సర్వదా అండగా ఉంటుందని గతంలోనే మాటిచ్చాను. ఈనెల 10వ తేదీ తర్వాత మరోసారి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తాను''అని పవన్ ప్రకటనలో పేర్కొన్నారు.

దేశం నలుమూలలా..

దేశం నలుమూలలా..

పార్టీ పరంగా అమరావతికి అనుకూలమే అయినప్పటికీ రాజధానిని తరలించే విషయంలో సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుపడబోమని, రైతులకు అనవసరంగా భ్రమలు కల్పించబోమని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహారావు చేసిన వ్యాఖ్యలపై జనసేన ఇంకా స్పందించలేదు. అయితే బీజేపీ ఎంపీ మాట్లాడిన కొద్దిసేపటికే అమరావతిలో పవన్ క్షేత్రస్థాయి ఉద్యమకార్యాచరణపై జనసేన ప్రకటన చేయడం గమనార్హం. కేంద్రం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని బీజేపీ నేతలు ప్రకటించగా.. పవన్ మాత్రం పోరాటానికి సిద్ధమని వెల్లడించారు. అమరావతి రైతుల వాణి.. దేశం నలుమూలలా వ్యాపించేలా గట్టిగా నినదిస్తానని, సేవ్ అమరావతి ఉద్యమానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తానని పవన్ కల్యాణ్ తన ప్రకటనలో స్పష్టం చేశారు.

English summary
jana sena chief pawan kalyan to meet amaravati farmers after february 10th. the party announced pawan amaravati tour schedule after bjp mp gvl narasimha rao clarified on ap capital issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more