వారాహి దీక్ష విరమించిన పవన్ కల్యాణ్
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వారాహి దీక్ష విరమించారు. సమాజ క్షేమం, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ..పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి అమ్మవారి దీక్ష శుక్రవారంతో పూర్తి అయింది. 11 రోజుల పాటు ఈ దీక్ష కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వారాహి దీక్షలో భాగంగా పవన్ కల్యాణ్ ఏకాదశ దిన ఆదిత్య ఆరాధన చేశారు.
వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ సూర్యభగవాణ్ణున్ని పూజించారు. గత నెల 26న పవన్ అమ్మవారి వారాహి దీక్ష చేపట్టారు. ప్రస్తుతం వారాహి దీక్షలో ఉన్న ఆయన సూర్యారాధనలో పాల్గొన్నారు. ఈ 11 రోజులు కూడా కేవలం పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకున్నారు. వెన్ను నొప్పి తీవ్రంగా ఇబ్బందిగి గురి చేసినప్పటికి ఆయన పట్టుదలతో ఆ దీక్షను పూర్తి చేశారు.

2024 ఎన్నికల్లో అఖండ విజయం సాధించడంతో పవన్ ఈ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే వారాహి అమ్మవారి దీక్షపై వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. పవన్ కల్యాణ్ చెప్పులు వేసుకుని అమ్మవారి దీక్ష చేయడంపై వైసీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. పవన్ కల్యాణ్ చెప్పులు ధరించి దీక్ష చేయడం హిందువులను కించ పరచడమనే వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ చెప్పులు వేసుకుని దీక్ష చేయడంపై నటి శ్రీరెడ్డి సైతం స్పందించారు. పవన్ చెప్పులతో అమ్మవారి దీక్ష చేస్తోన్న ఫొటోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'బీజేపీని మెప్పించడానికా? చెప్పుతో దీక్షలు.. వాట్ ఏ హిందూ ఫాలోవర్' అంటూ రెండు పగలబడి నవ్వే బొమ్మలను శ్రీరెడ్డి జోడించింది.












Click it and Unblock the Notifications