"వారాహి" పేరు వెనుక ఉగ్రస్వరూపిణి మహాశక్తి; తొలిపూజలు అక్కడే!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజల్లోకి వెళ్ళాలని భావించిన జనసేనాని పవన్ కళ్యాణ్ తన ఎలక్షన్ బ్యాటిల్ కోసం వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రమంతా పర్యటించనున్న ఈ ప్రచార వాహనానికి వారాహి అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆ పేరే అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక వారాహి ట్రయల్ రన్ ను హైదరాబాద్లో నిర్వహించిన పవన్ కళ్యాణ్, తెలంగాణ రాష్ట్రంలోని తనకిష్టమైన ఆలయంలో వారాహికి పూజలు చేయించి ఏపీలో ఎన్నికల కురుక్షేత్రంలోకి అడుగుపెట్టనున్నారు.

కొండగట్టు అంజన్న ఆలయంలో వారాహికి తొలి పూజలు
వారాహి వాహనానికి జగిత్యాల జిల్లా కొండగట్టు క్షేత్రం లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ కు అత్యంత ఇష్టమైన ఆంజనేయ స్వామి ఆలయంలో వారాహి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
సాధారణంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త వాహనాలు కొన్న వారు చాలామంది కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో తొలి పూజలు నిర్వహిస్తారు. ఇక ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తనకు అత్యంత ఇష్టమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో తొలి పూజలను నిర్ణయించిన తర్వాతనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల యుద్ధానికి బయలుదేరనున్నారు.
వారాహి దుర్గాదేవి శక్తి రూపం .. ఉగ్రదేవతా స్వరూపం
ఇక పవన్ కళ్యాణ్ తన వాహనానికి వారాహి అని పేరు పెట్టడం వెనుక కూడా ఒక ముఖ్యమైన కారణం ఉందని ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. వారాహి అంటే అమ్మవారి శక్తి రూపాలలో ఒకరుగా చెబుతారు. అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా వారాహిని పురాణాలు చెబుతాయి. వారాహి రక్తబీజుడు అనే రాక్షసుడిని సంహరించిన శక్తి రూపమని తెలుస్తుంది. ప్రత్యంగిరా అమ్మవారి లాగా వారాహి దేవి కూడా ఉగ్ర దేవతా స్వరూపం. కార్యసిద్ధి కావాలనుకునేవారు వారాహి దేవిని పూజిస్తారు.

కార్యసిద్ధికి వారాహి .. పవన్ వాహనానికి పేరు పెట్టటం వెనుక పెద్ద కథే
దుర్గాదేవి సప్తమాతృకలలో ఒకరైన వారాహిని పవన్ కళ్యాణ్ తన వాహనానికి పేరుగా పెట్టుకోవడం తనకు కార్యసిద్ధి కలగాలని, అమ్మవారి శక్తి తనపై ఉండాలన్న ఉద్దేశంతో పెట్టి ఉంటారు అన్న చర్చ జరుగుతుంది. ఉగ్ర దేవతా స్వరూపమైన వారాహి, తన వాహనానికి పేరుగా పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై అంతే ఉగ్రరూపంతో ముందు ముందు విరుచుకుపడ్డారు ఉన్న సంకేతాన్ని కూడా ఇస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది.

వారాహి పేరు పవన్ కు కలిసొస్తుందని ఫ్యాన్స్ లెక్కలు
వారాహి రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ అంటూ జనసేన పార్టీ పోస్ట్ చేసిన వీడియోలో వారాహి వాహనం ఒక ఆర్మీ వాహనంలా, ఒక యుద్ధానికి వెళుతున్న వాహనంలా ఉందని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. వారాహి పేరులోనే విజయం ఉందని, పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే ఎన్నికలలో విజయం సాధించి తీరుతారని చర్చ జరుగుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎన్నికల వాహనం వారాహి పై రెండు తెలుగు రాష్ట్రాల లోని ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ ఈ వాహనానికి ఉన్న ప్రత్యేకతలు మాత్రమే కాకుండా, వాహనానికి పెట్టిన పేరు కూడా పవన్ కళ్యాణ్ కు కలిసొస్తుందని అంచనావేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. మరి వారాహి ఈసారి పవన్ కళ్యాణ్ కు ఎన్నికలలో ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నదో వేచి చూడాల్సిందే.
-
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications