వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీరేంటో అర్థంకావట్లేదు, అడగరా?: బాబుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం, బిజెపి బలపడాలంటే..

ప్రత్యేక హోదా విషయమై భారతీయ జనతా పార్టీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదాపై నాన్చుడు ధోరణి కారణంగా బిజెపిపై ప్రజల్లో ఆగ్రహం ఉందని ఆయన అన్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్రత్యేక హోదా విషయమై భారతీయ జనతా పార్టీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదాపై నాన్చుడు ధోరణి కారణంగా బిజెపిపై ప్రజల్లో ఆగ్రహం ఉందని ఆయన అన్నారు.

చదవండి: 'బిజెపితో టచ్‌లో నేతలు, ఏపీపై మోడీ దృష్టి': బాబుకు షాకిస్తారా?

విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐ) సంస్థ ఉద్యోగులు శనివారం హైదరాబాద్‌లో పవన్‌ కళ్యాణ్‌ను కలిశారు. డీసీఐని ప్రయివేటీకరణ చేయనున్నారనే ప్రకటన నేపథ్యంలో వారు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

చదవండి: మోడీకి 'ప్రత్యేక' షాకిచ్చేనా: కేజ్రీవాల్‌తో పవన్ కళ్యాణ్ కలుస్తారా

ఏపీలో బిజెపి పుంజుకోవాలంటే ఇలా చేయాలి

ఏపీలో బిజెపి పుంజుకోవాలంటే ఇలా చేయాలి

ప్రత్యేక హోదా విషయంలో బిజెపి నాన్చుడు ధోరణి అవలంభిస్తోందని పవన్ కళ్యాణ్ అన్నారు. దీంతో బిజెపిపై ప్రజల్లో విపరీతమైన ఆగ్రహం, కోపం ఉందన్నారు. రాష్ట్రంలో బిజెపి పుంజుకోవాలన్నా, నిలబడాలన్నా, ప్రజల్లో నమ్మకం కలగాలన్నారు. ఏపీలో బిజెపి బలం పెంచుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ పార్టీకి పైవిధంగా హితవు పలికారు.

Recommended Video

Pawan Kalyan ready to protest and demands AP Govt to continue GO 16
చంద్రబాబు! మీరెందుకు అండగా ఉండటం లేదు

చంద్రబాబు! మీరెందుకు అండగా ఉండటం లేదు

డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ వంటి లాభాల్లో నడిచే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరిస్తే ఎలా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తమిళనాడులో ఇలాంటి కేంద్ర సంస్థలను మూసే సమయంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడిందని, ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం అలా ఎందుకు చేయడం లేదని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉద్దేశించి నిలదీశారు.

అసలు మీ విధానం ఏమిటో అర్థం కావట్లేదు

అసలు మీ విధానం ఏమిటో అర్థం కావట్లేదు

ప్రత్యేక హోదా విషయంలోనూ ఏపీ ప్రభుత్వం విధివిధానాలేమిటో తనకు తెలియడం లేదని, అర్థం కావడం లేదని చంద్రబాబు ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. జనసేన తరపున అక్టోబరు, నవంబరులలో విశాఖ వెళ్లి పరిశీలిస్తానని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలపై తమ పార్టీ విధానం కూడా త్వరలో ప్రకటిస్తామన్నారు.

ప్రయివేటీకరణ చేస్తే నష్టపోతాయి

ప్రయివేటీకరణ చేస్తే నష్టపోతాయి

డీసీఐ విషయమై కేంద్రంపై పవన్ విమర్శలు చేశారు. ఇలా ప్రయివేటీకరణ చేస్తే ప్ర‌భుత్వరంగ సంస్థ‌లు న‌ష్ట‌పోతాయ‌న్నారు. ఏపీ ప్ర‌భుత్వం డీసీఐ ఉద్యోగుల ప‌క్షాన నిల‌బ‌డ‌డాలని అభిప్రాయపడ్డారు. ఈ స‌మ‌స్య‌ త‌మ ప‌రిధిలోకి రాద‌ని ఏపీ ప్రభుత్వం అనడమా? ప్రజాసమస్యలు మీ పరిధిలోకి రావా? అని బాబు ప్రభుత్వాన్ని ప‌వ‌న్ కళ్యాణ్ నిలదీశారు. దీనిపై స్పందించి కేంద్రాన్ని నిల‌దీయాల‌న్నారు.

English summary
Dredging Corporation of India employees approached the Jana Sena party leader Pawan Kalyan on the issue of the privatization of the public sector. The star immediately responded on the issue and raised his voice against the privatization, questioning the intentions of the central government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X