వెంగయ్య మృతి వైసిపి పతనానికి నాంది, జగన్ కు , అన్నా రాంబాబుకు పవన్ కళ్యాణ్ వార్నింగ్
వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒంగోలులో ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన వెంగయ్య కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు హెచ్చరికలు జారీ చేశారు.
Recommended Video
జనసేన కార్యకర్త వెంగయ్య కుటుంబాన్ని పరామర్శించి, ఆర్ధిక సాయం చేసిన పవన్ కళ్యాణ్
వచ్చే ఎన్నికల్లో అన్నా రాంబాబు ఎలా గెలుస్తారో చూస్తామంటూ,అసెంబ్లీలో కాలు పెట్టినివ్వమంటూ జనసేన పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
జనసేన కార్యకర్త వెంగయ్య కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కళ్యాణ్ వెంగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. వెంగయ్య భార్య తన భర్త మృతిపై పవన్ కళ్యాణ్ కు చెప్పి కన్నీటి పర్యంతం అయ్యారు. వెంగయ్య కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు.
ప్రశించినందుకే వెంగయ్యను చంపేస్తారా ? పవన్ ఫైర్
వెంగయ్య మరణంపై మాట్లాడిన పవన్ కళ్యాణ్ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ఏం తప్పు చేశాడని వెంగయ్య ప్రాణాలు కోల్పోయాడని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. గ్రామ సమస్య పై ఎమ్మెల్యేను నిలదీసేందుకు, మాటలతో మానసిక చిత్రహింసలకు గురి చేశారని, ప్రశ్నించినందుకు వెంగయ్య చంపేశారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేలు ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెడుతున్నారని ,కానీ పేదల బ్రతుకులు మారడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
జగన్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే చేసిన పనికి శిక్షిస్తారా ? మీకు ఆ ధైర్యం ఉందా?
వచ్చే ఎన్నికల్లో అన్నా రాంబాబు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చూసే బాధ్యత తాము తీసుకుంటామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జనసేన కార్యకర్తలపై పదేపదే దాడులు చేస్తే ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. జగన్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే చేసిన పనికి శిక్షిస్తారా ? మీకు ఆ ధైర్యం ఉందా అంటూ ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. అన్నా రాంబాబు గుర్తుంచుకో నిన్ను అధః పాతాళానికి తొక్కేస్తామని జనసేనాని హెచ్చరించారు.

ప్రకాశం జిల్లా ఎస్పీని కలిసి వెంగయ్య మృతిపై వినతిపత్రం ఇచ్చిన పవన్ కళ్యాణ్
పోలీసు వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడిన పవన్ కళ్యాణ్ వెంగయ్య మృతి వైసిపి పతనానికి నాంది అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా ? ఫ్యూడలిస్టు వ్యవస్థలో ఉన్నామా ? జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా ఎస్పీని కలిసి పవన్ కళ్యాణ్ వెంగయ్య ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు.
జనసేన పార్టీ నేతలకు, కార్య కర్తలకు తాను అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు .
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications