ఉచితాలు కాదు, అదే అడుగుతున్నారు..! పవన్ మరో సంచలనం..!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మధ్య చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ముఖ్యంగా విధానపరమైన అంశాలపై తన అభిప్రాయాల్ని ఈ మధ్య నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. తద్వారా ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా తన ఉనికిని చాటుకునేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. ఇదే క్రమంలో ఇవాళ పవన్ ఓ సంచలన ట్వీట్ చేశారు. ఇందులో ఆయన మరో విషయంలో తన అభిప్రాయం క్లారిటీగా చెప్పేశారు.
ఏడేళ్ల క్రితం 2018లో తిత్లీ తుఫాను వచ్చినప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి తాను బాధితుల్ని పరామర్శించినప్పటి ఓ ఫొటోను ఆ పార్టీ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ ఎక్స్ లో షేర్ చేశారు. ఇందులో ఆయన.. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం కోసం తాను ఎలా ప్రయాణం మొదలుపెట్టానో వివరించారు. క్లిష్ట సమయాల్లో పవన్ తమను ఎలా మోటివేట్ చేశారో కూడా వివరించారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు.

7 years ago, on Oct 12, 2018, my journey with @PawanKalyan garu in @JanaSenaParty began, driven by a vision for a stronger Andhra Pradesh. His able and kind leadership always motivates us even in the toughest of times. Here we are in the aftermath of Cyclone Titli, Srikakulam… pic.twitter.com/FsXcam1xYd
— Manohar Nadendla (@mnadendla) October 12, 2025
నాదెండ్ల మనోహర్ ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ పవన్ రిప్లై ఇచ్చారు. ఇందులో పవన్.. తాము వారితో (తిత్లీ తుపాను బాధితులతో) జరిపిన సంభాషణ చాలా స్పష్టంగా గుర్తుందని తెలిపారు. వారు ఉచితాలను అడగడం లేదు, వారు ఎటువంటి సంక్షేమ పథకాలను అడగడం లేదు కానీ వారు 'మాకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వండి, ఉచితాలను కాదు' అని గట్టిగా చెప్పారని తెలిపారు. మన యువత యొక్క నిజమైన సామర్థ్యాన్ని మనం ఉపయోగించుకోవాలి. వారి కలలను నెరవేర్చుకోవడానికి వారిని అర్థం చేసుకోవడానికి నేను మన యువతను కలుస్తూనే ఉంటానని వెల్లడించారు.

I remember quite vividly about the conversation we had with them. They were not asking for freebies, they were not asking for any welfare schemes but they have said firmly ‘ give us 25 years of future not freebies.’
— Pawan Kalyan (@PawanKalyan) October 12, 2025
We need to tap the true potential of our youth. I will keep… https://t.co/8bWCtI1ryL
వాస్తవానికి పవన్ ట్వీట్ ఏ ఉద్దేశంతో చేశారో తెలియదు కానీ.. ప్రస్తుతం ఏపీ సహా పలు రాష్ట్రాల్లో సంక్షేమ జాతర కొనసాగుతోంది.
గతంలో జగన్ సర్కార్ లో ఉచిత పథకాలపై విమర్శలు చేసిన కూటమి పార్టీలు..ఇప్పుడు అంతకంటే ఎక్కువగా పథకాల మొత్తం పెంచి మరీ ఇస్తున్నాయి. దీంతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి కొత్త పథకాలను కూడా ప్రారంభించారు. ఇలాంటి సమయంలో పవన్ ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications