వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ మాల: ఎర్రకండువాలతో పవన్ కళ్యాణ్ కోసం 49రోజుల దీక్ష; ఇది పవనిజం అంటే!!

|
Google Oneindia TeluguNews

సాధారణంగా దేవుళ్ళపైన అమితమైన భక్తి ఉన్నవారు మాల ధారణ చేస్తూ ఉంటారు. అయ్యప్ప స్వామి భక్తితో అయ్యప్ప మాల, అమ్మవారిపై భక్తితో భవాని మాల, ఆంజనేయ స్వామి భక్తితో హనుమాన్ మాల వేస్తూ ఉండడం మనందరికీ తెలుసు. అయితే కొత్తగా పవన్ మాల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ పై అమితమైన భక్తి భావంతో ఉన్న అభిమానులు ఏకంగా పవన్ కళ్యాణ్ కోసం మాల ధారణ చేయడం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ అయింది.

పవన్ కళ్యాణ్ కు మంత్రి అంబటి రాంబాబు సూటిప్రశ్న.. పవన్ ఫ్యాన్స్ ఘాటు రిప్లై!!పవన్ కళ్యాణ్ కు మంత్రి అంబటి రాంబాబు సూటిప్రశ్న.. పవన్ ఫ్యాన్స్ ఘాటు రిప్లై!!

49 రోజుల పవన్ కళ్యాణ్ దీక్షను చేపట్టిన పాలకొల్లు జనసైనికులు


ఇక అసలు విషయానికి వస్తే .. పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2వ తేదీన జన్మించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 49వ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు పవన్ మాల ధారణ చేసి 49 రోజుల పాటు దీక్ష చేపడుతున్నట్లుగా ప్రకటించారు. పాలకొల్లుకు చెందిన పలువురు యువకులు మెడలో ఎర్ర కండువాతో పవన్ మాల ధరించారు. 49 రోజుల పాటు దీక్ష చేపట్టిన వారు, ఈ 49 రోజులు పవన్ కళ్యాణ్ ప్రజల కోసం తీసుకున్న పలు ఆశయాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లడానికి తమ వంతుగా కృషి చేస్తామని చెప్పారు.

49 రోజులు ఎర్ర కండువాలతో అందరికీ సేవ

49 రోజులు ఎర్ర కండువాలతో అందరికీ సేవ


పవన్ మాల పేరుతో దీక్ష చేపట్టిన వారు నియమ,నిష్ఠలతో పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళతామని, ప్రజలకు సేవ చేస్తామని చెబుతున్నారు. నీతి, నిజాయితీలను నేర్చుకున్నామని, మరింతగా నీతి, నిజాయితీలను నేర్చుకుంటూ పవన్ కళ్యాణ్ కు మంచి పేరు తీసుకు రావడానికి పనిచేస్తామని జనసైనికులుగా నిర్ణయం తీసుకున్నామని వారు చెబుతున్నారు. ఈ 49 రోజులు ఎర్ర కండువాలతో అందరికీ సేవ చేస్తామని స్పష్టం చేశారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విధంగా పవన్ మాల ధరించి సేవ చేయడం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అంశం.

 పవన్ కళ్యాణ్ క్రేజ్ కు పవన్ మాల ఒక ఉదాహరణ

పవన్ కళ్యాణ్ క్రేజ్ కు పవన్ మాల ఒక ఉదాహరణ


పవన్ కళ్యాణ్ అంటే అభిమానులకు ఉండే క్రేజ్ కు, ఆయన పట్ల జనాలకు ఉండే అభిమానానికి పవన్ మాల ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ పేరెత్తితేనే యువతలో ఎక్కడలేని ఉత్సాహం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు యువత సందడి తారాస్థాయికి చేరుకుంటుంది. ఇక పవన్ కళ్యాణ్ పేరెత్తితేనే పూనకాలు వచ్చే అభిమానులు కూడా ఉన్నారు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంతటి ప్రజాభిమానం చూరగొన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2వ తేదీన జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుండే ఆయన ఫ్యాన్స్ ప్రజల్లోకి వెళ్లి పవన్ మాల వేసుకొని సేవ చేయడం నిజంగా ఆసక్తిని కలిగించే అంశం.

పవన్ మాల వెయ్యటం వెనుక పవన్ కళ్యాణ్ స్ఫూర్తి

పవన్ మాల వెయ్యటం వెనుక పవన్ కళ్యాణ్ స్ఫూర్తి


సామాన్యులలో సామాన్యుడిగా, సామాజిక సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించే గొంతుకగా, అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసే నాయకుడిగా, అవినీతికి తావు లేకుండా రాజకీయ పార్టీని నడిపించడానికి వచ్చిన నాయకుడిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు జనసైనికుల మనసులలో సుస్థిరమైన స్థానం ఉందని అభిమానులు పదేపదే చెప్తున్నారు. ఇక అదే వారిలో పవన్ కళ్యాణ్ మాల వేసేంత అభిమానాన్ని రేకెత్తిస్తుంది. వినడానికి విడ్డూరంగా అనిపించినా, రానున్న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేపథ్యంలో, పవన్ మాల ధరించి ప్రజాక్షేత్రంలో సేవ చేస్తామని చెప్పడం నిజంగా ప్రశంసించ తగిన విషయం.

పవనిజం అంటే ఇదే ... దీక్ష చేసే వారికి అభిమానుల శుభాకాంక్షలు

పవనిజం అంటే ఇదే ... దీక్ష చేసే వారికి అభిమానుల శుభాకాంక్షలు


ఇక పవన్ కళ్యాణ్ కోసం చేసే దీక్ష గురించి తెలిసిన చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన నాయకులు పవనిజం అంటే ఇది అని చెప్పుకుంటున్నారు. ప్రజల కోసం పని చేయాలనే పవన్ కళ్యాణ్ ఆలోచనను జనసైనికులు ముందుకు తీసుకు వెళ్లడం మంచి పరిణామమని చెప్పుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కోసం యువత చేపట్టిన ఈ దీక్ష సక్సెస్ అవ్వాలని, దిగ్విజయంగా ప్రజలకు సేవ చేయాలని వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

English summary
pawan kalyan fans in AP wore Pawan Mala. The youth of Palakollu announced that they are doing a 49-day deeksha for Pawan Kalyan with red scarves. His fans are saying wishes to them saying this is Pawanism
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X