ఏం చేద్దాం: సభకు ముందే బాబుతో పవన్ కళ్యాణ్ భేటీ
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారని సమాచారం. రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని కలిసిన విషయం తెలిసిందే.
కాంగ్రెసు హఠావో దేశ్ బచావో అని పవన్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెసు పార్టీ వ్యతిరేకులతో జట్టు కట్టేందుకు సిద్ధమవుతున్నరు. ఇందులో భాగంగా ఆయన రెండు రోజుల క్రితం మోడీని కలిశారు. గత ఆదివారం చంద్రబాబును కలిసినట్లుగా వార్తలు వచ్చాయి.

ఈ నెల 27న విశాఖపట్నంలో నిర్వహించబోతున్న బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ సభకు ముందే చంద్రబాబుతో భేటీ కావాలని పవన్ భావిస్తున్నారట. ఇప్పటికే పవన్ బిజెపికి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. చంద్రబాబుతో రానున్న ఎన్నికల కోసం వ్యూహాలపై చర్చించనున్నారు.
మోడీతో భేటీ అయిన పవన్... తెలుగు వారి అభివృద్ధి, తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత సమస్యలపై చర్చించారు. దేశానికి, తెలుగు వారికి బిజెపితో న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని, అందుకే తాను మద్దతిస్తున్నానని పవన్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications