• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బీజేపీతో పవన్ కళ్యాణ్ ఇక సమరమేనా - విశాఖ కేంద్రంగా : జగన్ ను ఫిక్స్ చేస్తూ - కొత్త వ్యూహంతో..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత వేగంగా తన రాజకీయ అడుగులు వేస్తున్నారు. బీజేపీతో ఉండాలా...వద్దా అనే స్థాయిలో ముందుకెళ్తున్నారు. బీజేపీ నేతలు పవన్ తీరును నిశితంగా గమనిస్తున్నారు. దీంతో..ఇప్పుడు పవన్ తాజాగా తీసుకున్న మరో నిర్ణయం సైతం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల కోసం అధికార పార్టీ ముందస్తుగానే సమాయత్తం అవుతోంది. తాజాగా పవన్ కళ్యాణ్ రోడ్ల మరమ్మత్తుల విషయంలో రాజమండ్రి సభలోనే తన రాజకీయ లక్ష్యాన్ని స్పష్టం చేసారు. తాజాగా ఏపీలోని జనసేన అన్ని జిల్లాల నేతలతో సమావేశమయ్యారు.

త్వరలో జిల్లా పర్యటనలకు పవన్ కళ్యాణ్

త్వరలో జిల్లా పర్యటనలకు పవన్ కళ్యాణ్

త్వరలో జిల్లా పర్యటనలకు రానున్నట్లు పవన్ వారికి స్పష్టం చేసారు. అదే విధంగా పార్టీని మండల స్థాయి నుంచి కమిటీలు నియమించి బలోపేతం పన ఫోకస్ పెట్టారు. బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నా.. రెండు పార్టీలు కలిసి చేసిన ప్రజాందోళన..ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటి వరకు లేవు. ఇక తిరుపతిలో కలిసి పోటీ చేసినా ఫలితం అనుకూలంగా రాలేదు. ఇక, ఇప్పుడు బద్వేలులో జనసేన పోటీ చేయకూడదని నిర్ణయించగా.. బీజేపీ పోటీకి దిగింది. దీంతోనే..బీజేపీ - జనసేన మధ్య పొత్తు చెదిరే సంకేతాలు కనిపిస్తున్నాయనే విశ్లేషణలు మొదలయ్యాయి. బద్వేలులో బీజేపీకి మద్దతిస్తామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ చెప్పినా..పవన్ మాత్రం ప్రచారానికి దూరంగానే ఉన్నారు.

బద్వేలుతో బీజేపీకి తొలి షాక్

బద్వేలుతో బీజేపీకి తొలి షాక్

మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనుంది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా...విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యతిరేక పోరాటంలో ఆయన నేరుగా పాల్గొంటారని పార్టీ నేతలు స్పష్టం చేసారు. ఈ నెల 31న పవన్ విశాఖ రానున్నారు. విశాఖ స్టీల్ ప్రయివేటీకరణ ప్రతిపాదన రాగానే.. ముఖ్యమంత్రి స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరించకుండానే ఏ విధంగా కొనసాగించవచ్చో సూచిస్తూ... అదే సమయంలో స్టీల్ ప్లాంట్ ఏపీ ప్రజల సెంటిమెంట్ తో ముడి పడి ఉందంటూ ప్రధానికి లేఖలు రాసారు. దీని పైన ఏపీ అసెంబ్లీలోనూ తీర్మానం చేసారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నేతలతోనూ సమావేశమయ్యారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా

ఇక, పవన్ సైతం కొద్ది నెలల క్రితం పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తో కలిసి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశమయ్యారు. స్టీల్ ప్లాంట్ వ్యవహారం పైన వినతి పత్రం ఇచ్చారు. ఇక, ఇప్పుడు పవన్ నేరుగా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటంలో పాల్గొనాలని డిసైడ్ అయ్యారు. కేంద్రం ఇప్పటికే పలుమార్లు స్టీల్ ప్లాంట్ నిర్ణయం పైన వెనక్కు తగ్గేది లేదని తేల్చి చెప్పేసింది. ఉద్యోగులు మాత్రం ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే, పవన్ ఇప్పుడు కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారా.. ఉద్యోగులకు ఎటువంటి భరోసా ఇస్తారనేది కీలకంగా మారింది. ఉద్యోగులకు మద్దతివ్వాలంటూ కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిందేని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

ఇక, బీజేపీకి దూరం అవుతున్నట్లేనా..

ఇక, బీజేపీకి దూరం అవుతున్నట్లేనా..

దీని ద్వారా బీజేపీకి పవన్ బద్వేలు తరువాత మరో వార్నింగ్ బెల్ మోగిస్తున్నట్లుగా విశ్లేషణలు మొదలయ్యాయి. బీజేపీ - జనసేన మధ్య పొత్తు ఎక్కువ కాలం కొనసావనే సంకేతాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. కింది స్థాయి జనసేన నేతలు సైతం బీజేపీ కంటే టీడీపీతో పొత్తు బెటర్ అనే అభిప్రాయంతో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో టీడీపీ - జనసేన మధ్య క్షేత్ర స్థాయిలో ఒప్పందాలు చేసుకొని పోటీ చేసారు. టీడీపీ నుంచి సీనియర్ నేతలు ఓపెన్ గానే జనసేన తో పొత్తు పెట్టుకోవాలని కోరుతున్నారు.

ఏపీలో కొత్త పొత్తులు పొడుస్తాయా

ఏపీలో కొత్త పొత్తులు పొడుస్తాయా

దీంతో..ఇప్పుడు కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా జరుగున్న ఉద్యమానికి మద్దతుగా పవన్ పాల్గొనటం ద్వారా బీజేపీతో దూరం కావటంలో మరో అడుగుగా అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే, అక్కడ సైతం పవన్ సీఎం జగన్ ..వైసీపీనే లక్ష్యంగా చేసుకొనే అవకాశం ఉందని పార్టీ నేతల సమాచారం. దీంతో పాటుగా.. నవంబర్ 1, 2తేదీల్లో మత్స్యకార ప్రాంతాలలో పవన్ పర్యటించనున్నారు. వారి సమస్యల పైన పవన్ ప్రభుత్వానికి డిమాండ్లు పెట్టే అవకాశం కనిపిస్తోంది. దీంతో..ఇక, పవన్ విశాఖ టూర్ పైన ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి నెలకొని ఉంది. దీని పైన బీజేపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

English summary
Pawan Klayan moving strategically his steps in AP politics. Pawan decided to support Vizag steel plant employees against privitization.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X