పవన్ ఫోటో: జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్, టిడిపి మధ్య ఘర్షణ
నల్గొండ/హైదరాబాద్: నల్గొండ తెలుగుదేశం పార్టీ డోర్ పోస్టర్లు కొత్త సమస్యను సృష్టించాయి. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న స్వామిగౌడ్ తన పోస్టర్లలో పవన్ కల్యాణ్ ఫొటో వేశారు. ఇది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.
పోస్టర్లలో జూనియర్ ఎన్టీఆర్ ఫొటో ఎందుకు లేదని... వారు పోస్టర్లను చింపి దగ్ధం చేశారు. పోస్టర్లలో పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఫొటో ఉందని, అలాంటప్పుడు పోస్టర్లను మీరెలా దగ్ధం చేస్తారంటూ ఈ వ్యవహారాన్ని టిడిపి కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో టిడిపి కార్యకర్తలకు, జూ ఎన్టీఆర్ అభిమానులకు మధ్య ఘర్షణ తలెత్తింది.

టిడిపిలోకి మాగుంట
ఒంగోలు కాంగ్రెస్ లోకసభ సభ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. మధ్యాహ్నం ఆయన పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకుంటారు. మాగుంటకు ఒంగోలు లోకసభ సీటు ఖరారు చేసే అవకాశమున్నట్టు సమాచారం.
చంద్రబాబు పర్యటన
చంద్రబాబు సోమవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన రాజమండ్రి విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం 3 గంటలకు కోరుకొండ మండలం గాడాల రోడ్ షో లో పాల్గొంటారు. రాత్రి 7.00 గంటలకు రావులపాలెం చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో మాట్లాడతారు. తరువాత 11 గంటలకు తణుకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.












Click it and Unblock the Notifications