• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎన్నికల ఫలితాలపై పవన్ స్పందించారు .. ఏమన్నారంటే

|
  Ap Assembly Election 2019 : ఎన్నికల ఫలితాలపై పవన్ స్పందించారు.. ఏమన్నారంటే? || Oneindia Telugu

  ఏపీలో పోలింగ్ ముగిసినా నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. టీడీపీ 130స్థానాల్లో విజయం సాధించి తిరిగి అధికారం హస్తగతం చేసుకుంటామని చెప్తే , వైసీపీ జగన్ సీఎం అవుతారని ముహూర్తం దేవుడే నిర్ణయిస్తాడని చాలా ధీమాతో ఉంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలింగ్ తర్వాత కనిపించకుండా పోయారు. ఇక తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆయన ఎన్నికల ఫలితాలపై తనదైన శైలిలో స్పందించారు.

  జేడీని వైసిపిలోకి ఆహ్వానించారా : జ‌గ‌న్ అనుమ‌తితోనే జ‌రిగిందా : సాయిరెడ్డికి ఇక జన‌సైనికుల రిప్లై...

  ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్

  ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, వైసీపీ లాగా జనసేన సీట్ల లెక్క వేయదని , జనసేనకు అన్ని సీట్లు వస్తాయి, ఇన్ని సీట్లు వస్తాయని తాను చెప్పను అన్నారు పవన్ . కాకుంటే జనసేన చెప్పే మార్పు మొదలైందని, దాన్ని కొనసాగిద్దామని పవన్‌ అన్నారు. మార్పు ఎప్పుడూ చిన్నగానే మొదలవుతుందని, జనసేన ఎదిగే దశలో ఈ మార్పు ఎంతవరకు వెళ్తుందో తెలియదన్నారు. గుంటూరులోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అసెంబ్లీ అభ్యర్థులతో పవన్ సమావేశం అయ్యారు. ఎన్నికల్లో వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు లేని వేళ కూడా ప్రజలతో మమేకమవ్వాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పనిచేయాలని సూచించారు పవన్ కళ్యాణ్.

  ఎప్పుడూ ప్రజల్లో ఉండాలని జనసేన నేతలకు పవన్ సూచన

  ఎప్పుడూ ప్రజల్లో ఉండాలని జనసేన నేతలకు పవన్ సూచన

  పార్టీని క్షేత్ర స్థాయిలో పటిష్టం చెయ్యాలని ,గ్రామ స్థాయి నుంచి కొత్తతరం నేతలను తయారు చేయాలని పవన్‌ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే మార్పును ప్రజల్లోకి తీసుకెళ్దామని నేతలతో అన్నారు. తెలంగాణలోనూ ఇదే తరహా మార్పును ప్రజలు ఆహ్వానిస్తున్నారని, ప్రతి గ్రామానికీ ఒక రోజు కేటాయించి అందరినీ కలవాలని నేతలకు నిర్దేశించారు.జనసేన అధినేత పవన్ ఎన్నికల్లో ఓటింగ్‌ సరళి గురించి మాత్రమే వారిని అడిగి తెలుసుకున్నట్టు చెప్పారు. స్థానిక సమస్యలను గుర్తించి పరిష్కారం దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమస్య పెద్దదైతే తాను సైతం స్పందిస్తానని చెప్పారు. ఇక పార్టీ విషయంలో నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యాలయాలు కొనసాగించాలని సూచించారు. ప్రతి చోటా రెండు కుటుంబాలే పెత్తనం చేస్తున్నాయని, ఈ అంశంపైనే పోరాటం చేద్దామని పవన్‌ తన పార్టీ నేతలతో అన్నారు.

  సీట్ల లెక్కలు వేయమని చెప్పిన జనసేనాని .. మార్పు అయితే మొదలైంది అన్న పవన్

  సీట్ల లెక్కలు వేయమని చెప్పిన జనసేనాని .. మార్పు అయితే మొదలైంది అన్న పవన్

  ఏపీలో పోలింగ్ తర్వాత పవన్ కనిపించని పవన్ ఫైనల్ గా నోరు విప్పారు. పోలింగ్ తర్వాత ఓటింగ్ సరళిపై రాజకీయ పార్టీల స్పందనకు భిన్నంగా పవన్ వ్యవహరించారు. పోలింగ్ సరళి ఎలా ఉంది, తమ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది చెప్పకుండా పవన్ పార్టీని బలోపేతం చెయ్యాలని,క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారం కోసం పని చెయ్యాలని జనసేన సైనికులకు దిశా నిర్దేశం చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఒకపక్క చంద్రబాబు, జగన్ విజయం తమది అని లెక్కలు వేసి మరీ చెప్తే వారిద్దరికి భిన్నంగా పవన్ వ్యవహరించారు.సీట్ల లెక్కలు వేయమని, మార్పు కోసమే జనసేన అని పవన్ తనదైన శైలిలో స్పందించారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Janasena's chief Pawan Kalyan has made interesting comments on the election results. Pawan said, "TDP, like the YCP, does not count the seats, We expected the change in the public. the change was started from the election. it will be continue , Pawan said. TDP, and YCP responded on polling results in their own style .and they predict about the victory .But Janasena chief Pawan kalyan doesn't tell anything about the result. guided the team to always to do service to people .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more