బెయిల్ కోసం జగన్ బేరం, ఒప్పందం: పయ్యావుల

తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైయస్ జగన్ బెయిల్‌ను అడ్డుకోవడానికి ఢిల్లీ వెళ్లడం లేదని ఆయన స్పష్టం చేశారు. దర్యాప్తు పూర్తిగా చేయకుండా సిబిఐ వైయస్ జగన్ కేసులో తుది చార్జిషీట్ ఎందుకు వేస్తోందని ఆయన అడిగారు. జగన్ అవినీతిపై పోరాటం చేస్తామని, అవసరమైతే కోర్టుకు వెళ్తామని ఆయన చెప్పారు.
బెయిల్ కోసం బేరం కుదుర్చుకోవడం వల్లనే జగన్ కేసులో సిబిఐ, ఈడిలు వేగం తగ్గించాయని ఆయన విమర్శించారు. అక్రమాలను ఉపేక్షించవద్దని ఢిల్లీ వెళ్లి దర్యాప్తు సంస్థలను కోరుతామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితిపై కేంద్రం కన్నెత్తి కూడా చూడడం లేదని ఆయన అన్నారు. అనిశ్చితి తొలగించాలని ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని, ప్రధానిని, ఇతర పార్టీల నేతలను కోరుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications