స్కిల్ స్కాంలో సీమెన్స్ తప్పుకు చంద్రబాబు బాధ్యతా ? దుష్ప్రచారం చేస్తే కోర్టుకు-పయ్యావుల కామెంట్స్
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ లో జరిగిందని చెబుతున్న కుంభకోణంలో చంద్రబాబు పాత్ర లేనే లేదని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తేల్చిచెప్పారు.
అమరావతి : ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో అవినీతిజరిగిందంటూ సీఎం జగన్, సాక్షి మీడియా లేనిపోని ఆరోపణలతో, అభూతకల్పనలతో దుష్ప్రచారం చేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (payyavula keshav) మండిపడ్డారు. వైసీపీప్రభుత్వం ఏర్పడి 4ఏళ్లు అవుతున్నా, జగన్ దానిపై ఎందుకు ఏమీతేల్చలేకపోయాడని పయ్యావుల ఆక్షేపించారు. హైదరాబాద్ ను ఎలాగైతే చంద్రబాబు ఐటీహబ్ గా మార్చారో, అదేవిధంగా విభజనానంతర ఏపీలోని యువతకు, మెరుగైన ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సీమెన్స్ సంస్థతో గతంలో టీడీపీప్రభుత్వం ఒప్పందంచేసుకుందని గుర్తుచేశారు.
సీమెన్స్ సంస్థకు అధిపతిగా ఉన్న సుమన్ బోస్ తాను నిర్ణయించుకున్న కొందరికి ఏదో లబ్ధిచేకూర్చాడని మీడియాలో వచ్చిం దని, సుమన్ బోస్ చర్యకు చంద్రబాబుకి ఏమిటి సంబంధమని పయ్యావుల ప్రశ్నించారు. సీమెన్స్ జర్మనీ సంస్థ అని, అది 160కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఆ సంస్థ గుజరాత్ లోని యువతకు నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన శిక్షణ ఇస్తోందని తెలిసి, దానిపై స్టడీ చేశాకే చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందంచేసుకుందని గుర్తుచేశారు.
సీమెన్స్ సంస్థకు సంబంధించిన ఓ పత్రం ప్రజల ముందు ఉంచుతున్నామని, దాన్ని చూశాక జగన్, సాక్షి మాట్లాడాలన్నారు.

టీడీపీ ప్రభుత్వం సీమెన్స్ సంస్థతో చేసుకున్న ఒప్పందంలో చాలాస్పష్టంగా, సీమెన్స్ సంస్థ ఏంచేయాలో, దాని అనుబంధసంస్థ అయిన డిజైన్ టెక్ ఏంచేయాలో చాలాస్పష్టంగా పేర్కొన్నట్లు పయ్యావుల తెలిపారు. సీమెన్స్ సంస్థో, డిజైన్ టెక్ వారో తప్పులుచేస్తే, వాటికి టీడీపీప్రభుత్వానికి, చంద్రబాబుకు ఏంటి సంబంధం ? అని ప్రశ్నించారు. సీమెన్స్ సంస్థ తప్పుచేస్తే, ఆ సంస్థతో గతంలో ఒప్పందాలు చేసుకున్న తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ ప్రభుత్వాలుకూడా తప్పుచేసినట్టేనా? వాటి గురిం చి జగన్ అతని మీడియా ఎందుకు ప్రశ్నించదని పయ్యావుల అడిగారు. ? సీమెన్స్ సంస్థతో చేసుకున్న ఒప్పందానికి సంబంధించి టీడీపీప్రభుత్వంవిడుదలచేసిన నిధులు బినామీ అకౌంట్ల నుంచి తిరిగి తెలుగు దేశంనేతల అకౌంట్లలోకి బదిలీ అయ్యాయంటున్నారు. ఎవరి అకౌంట్లలోకి ఎప్పుడు బదిలీ అయ్యాయో అదికూడా చెప్పాలన్నారు.
బట్టకాల్చి ముఖాన వేయడంకాదు... టీడీపీనేతల ఖాతాల్లోకి నిధులు ఎలావచ్చాయో, ఎటు నుంచి వచ్చాయో, ఆనేతలు ఎవరో బయటపెట్టాలని పయ్యావుల డిమాండ్ చేశారు. ఇష్టానుసారం ఆరోపణలు చేస్తే జగన్, ఆయన ప్రభుత్వంపై న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. వైఎస్ హయాంలో ప్రభుత్వ విధానాలతో లబ్ది పొందిన వారు, జగన్, ఆయన అకౌంట్లలోకి డబ్బు మళ్లించారని, ఇప్పుడు స్కిల్ స్కాంలోనూ అలాగే టీడీపీలో ఎవరి ఖాతాల్లోకైనా డబ్బు వెళితే బయటపెట్టాలని పయ్యావుల కోరారు. అలా కాకుండా ఇష్టానుసారం ఆరోపణలుచేస్తే న్యాయపోరాటం చేసైనా వారికి బుద్ధిచెబుతామన్నారు.
-
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications