'లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వస్తే టీడీపీకే లాభం, పవన్ కళ్యాణ్-జగన్ ఆరాటం'
అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ వీఆర్ఎస్ (స్వచ్చంధ పదవీ విరమణ)కు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన మహారాష్ట్ర డీజీపీకీ లేఖ రాశారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర అదనపు డీజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
సత్యం కుంభకోణం, జగన్ అక్రమాస్తులు, ఓబుళాపురం మైనింగ్, ఎమ్మార్ ప్రాపర్టీస్ దర్యాఫ్తులో ఆయన చురుకైన పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయన హఠాత్తుగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వస్తారనే చర్చ సాగుతోంది.

దీనిపై తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ స్పందించారు. లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరినా టీడీపీకే లాభమని చెప్పారు. ప్రతిపక్ష పాత్ర కోసం పవన్ కళ్యాణ్, జగన్ ఆరాట పడుతున్నారని ఎద్దేవా చేశారు. లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వస్తే ప్రతిపక్ష ఓట్లు చీలుతాయని జోస్యం చెప్పారు. అప్పుడు టీడీపీకి లభ్ది చేకూరుతుందన్నారు.












Click it and Unblock the Notifications