లెక్కలు అడిగితే బుర్ర కథలు చెప్తారేం, వదిలిపెట్టం, కేంద్రానికి లేఖ రాస్తాం : బుగ్గనపై పయ్యావుల ధ్వజం
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిపై పయ్యావుల కేశవ్ చేసిన ఆరోపణలపై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ స్పందించిన విషయం తెలిసిందే. అర్ధరహితమైన ఆరోపణలు చేశారంటూ, గవర్నర్ కు లేఖ రాసి మీడియా సమావేశాలు పెట్టి కావాలని రచ్చ చేస్తున్నారంటూ పయ్యావుల కేశవ్ పై బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. ఈ క్రమంలో తాజాగా పయ్యావుల కేశవ్ బుగ్గన రాజేంద్రనాథ్ పై మరోమారు మాటల తూటాలను ఎక్కుపెట్టారు.

గవర్నర్ కు ఫిర్యాదు చేసిన అంశాలపై వివరణ ఏది ?
రాష్ట్ర ఆర్థిక శాఖ 41 వేల కోట్ల బిల్లులను నిబంధనలకు విరుద్ధంగా చెల్లించిందని తాను గవర్నర్ కు ఫిర్యాదు చేస్తే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దానికి వివరణ ఇవ్వకుండా బుర్రకథలు చెబుతున్నారని పీఏసీ చైర్మన్ టిడిపి సీనియర్ నేత పయ్యావుల కేశవ్ తీవ్రంగా మండిపడ్డారు. బ్యాంకుల నుండి 25,000 కోట్ల రుణాలు తీసుకునేందుకు ఏపీఎస్డిసి కి పూచీకత్తు ఇచ్చిన విషయాన్ని శాసనసభకు సైతం తెలియకుండా ప్రభుత్వం దాచి పెట్టిందని, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన దీనికేం సమాధానం చెప్తారని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.

మీరే మేధావి అన్నట్టు మిగతా వ్యవస్థలన్నీ తప్పు చేస్తున్నట్లు బిల్డప్ దేనికి ?
ప్రతిపక్ష పార్టీ నేతలకు చెప్పకపోయినా సభకు, ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలని పేర్కొన్న పయ్యావుల కేశవ్ ఎన్ని వేల కోట్ల రూపాయలకు ప్రభుత్వం పూచీ ఇచ్చిందో బ్యాంకులతో కుదుర్చుకున్న ఒప్పందాలలోని షరతులు ఏంటో బయట పెట్టాలంటూ డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలకు లెక్కలే తెలీవు.. కామన్ సెన్స్ లేదు .. అంటూ మీరే మేధావి అన్నట్టు మిగతా వ్యవస్థలన్నీ తప్పు చేస్తున్నట్లు మాట్లాడారంటూ మండిపడ్డారు. అయితే మీ మేధావితనాన్ని అంగీకరించడానికి తమకేమీ ఇష్టం లేదని పేర్కొన్న పయ్యావుల మేము లేవనెత్తిన అంశాలకు ఒక ఆర్థిక శాఖ మంత్రిగా సమాధానం వస్తుందని ఆశిస్తే రాజకీయ ఆరోపణలు చేయడం తప్ప, ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్ప లేదంటూ మండిపడ్డారు.

బుర్రకథలను ఇకనుండి బుగ్గన కథలు అని ప్రజలు వ్యవహరించే పరిస్థితి
బుర్రకథలను ఇకనుండి బుగ్గన కథలు అని ప్రజలు వ్యవహరించే పరిస్థితి తెచ్చుకోవద్దని పయ్యావుల కేశవ్ ద్వజమెత్తారు. ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని సాహసం ఏపీ ప్రభుత్వం చేస్తోందని, రాజ్యాంగ విరుద్ధమైన జీవోలను జారీ చేసి బ్యాంకు రుణం తిరిగి చెల్లించడం కోసం ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని ఎస్క్రో ఖాతాలో జమ చేయాలని బ్యాంకులు షరతు విధించడంతో అదే విధంగా చేస్తున్నారని మండిపడ్డారు. అయితే ప్రభుత్వం వసూలు చేసే ఏ పన్ను అయినా ప్రభుత్వ ఖజానాలోకి రావాలని అలా కాకుండా నేరుగా ఎస్క్రో ఖాతాలో జమ చేయడం తప్పని ధ్వజ

కేంద్రానికి లేఖ రాసి ఏం జరుగుతుందో చెప్తాం
ఇదేమని ప్రశ్నిస్తే రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు పయ్యావుల కేశవ్. అంతేకాదు బుగ్గన చెబుతున్నట్లుగా తాను ఇంతవరకు ఢిల్లీకి లేఖ రాయలేదని, బుగ్గన లాంటి మేధావి సలహా ఇచ్చారు కాబట్టి ఇక కేంద్రానికి లేఖ రాసి ఏపీలో ఏం జరుగుతుందో కేంద్రానికి అర్థమయ్యేలా చెబుతామని పేర్కొన్నారు. పీఏసీ చైర్మన్ హోదాలో త్వరలో ఆర్థిక శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమీక్షిస్తామని, ఇక ఆర్థిక శాఖ అధికారులు ఏ విధంగా సహకరిస్తారో ప్రజలే చూస్తారని పేర్కొన్నారు పయ్యావుల కేశవ్.

25 వేల కోట్లకు పూచీకత్తు ఇచ్చిన విషయం బడ్జెట్ పుస్తకాల్లో కూడా ప్రస్తావించరా?
25 వేల కోట్లకు ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చిన విషయాన్ని కనీసం బడ్జెట్ పుస్తకాల్లో కూడా ప్రస్తావించలేదని, ఇంకా ఇలాంటివి ప్రభుత్వం ఎన్ని దాచిపెట్టిందో అని మండిపడ్డారు. ప్రభుత్వ ఉత్తర్వులు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టులో సవాల్ చేసేసరికి ఎస్క్రో ఖాతా నిబంధన పెట్టలేదంటూ అడ్వకేట్ జనరల్ కోర్టుకు కూడా అబద్ధం చెప్పారని మండిపడ్డారు. ఇక ప్రభుత్వం ఒక జీవో జారీ చేసి , కోర్టుకు అదేమీ లేదని అబద్ధం చెప్పి మసి పూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తోందని, ఇంతకీ ఈ జీవో జారీ చేశారా? లేదా అనేది మాత్రం నిజం చెప్పటం లేదని మండిపడ్డారు.

గతేడాది ఏడు లేఖలు రాస్తే ఏక వాక్య సమాధానం ఇచ్చారు
పీఏసీ చైర్మన్ గా సమాచారం అడిగితే ఎందుకు ఇవ్వము అని చెబుతున్నారని, గతేడాది రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాలు, సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు రుణాలు తీసుకోవడానికి పూచీకత్తు వివరాలు అడిగితే, ఏడుసార్లు లేఖలు పంపితే బడ్జెట్ పుస్తకాల్లో చూసుకోమని ఏకవాక్య సమాధానం ఇచ్చారని మండిపడ్డారు. మొత్తానికి ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వాన్ని వదిలేది లేదని , అవసరమనుకుంటే కేంద్ర ఆర్థిక శాఖకు, ఆర్బీఐ కూడా తెలియజేస్తామని పయ్యావుల కేశవ్ తేల్చిచెప్పారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications