వారెవ్వా - పయ్యావుల వర్సెస్ ప్రభుత్వం- ఏం రాజకీయం : ఆ ఆర్దిక ఆరోపణల వెనుక అసలు ట్విస్ట్

పయ్యావుల కేశవ్. టీడీపీ ఫైర్ బ్రాండ్. సీనియర్ నేత. ప్రస్తుతం పీఏసీ ఛైర్మన్. రెండేళ్లుగా వైసీపీ పైన విమర్శల విషయంలో..ప్రతిపక్ష నేతగా వ్యవహరించటంలో పయ్యావుల ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఒక సమయంలో ఆయన టీడీపీ వీడుతారనే ప్రచారమూ జోరుగా సాగింది. కానీ, సడన్ గా ఆయన కొద్ది రోజులు క్రితం పీఏసీ ఛైర్మన్ హోదాలో బయటకు వచ్చి..ప్రభుత్వం పైన విమర్శలు చేసారు. ఆర్దిక నిర్వహణ అంతా అస్తవ్యస్థంగా ఉందంటూ నేరుగా గవర్నర్ కు ఫిర్యదు చేసారు. ఆ తరువాత కేంద్రం నుంచి వచ్చిన ఒక లేఖను బయట పెట్టారు.

సడన్ గా టార్గెట్ ఏపీ ప్రభుత్వం..

సడన్ గా టార్గెట్ ఏపీ ప్రభుత్వం..


ప్రభుత్వం వద్ద 41 వేల కోట్ల రూపాయాలకు సంబంధించి లెక్కలు చూపించటంలేదని...దేని కింద ఖర్చు చేసింది లెక్కలు లేవంటూ విమర్శలు చేసారు. దీని పైన ప్రభుత్వం నుండి ఆలస్యంగా అయినా..ఆర్దిక మంత్రి స్పందంచారు. పయ్యావుల విమర్శలకు సమాధానం చెప్పారు. కానీ, పయ్యావులను మాత్రం ఒక్క మాట అనలేదు. ఇక, ఇదే సమయంలో పయ్యావుల ఆరోపణలు నిజమైతే యనమల మౌనంగా ఉంటారా అంటూ బుగ్గన ప్రశ్నించారు. అక్కడ అందరూ నిజమే కదా అనే డౌట్ అందరిలోనూ మొదలైంది. ఆ తరువాత ఆర్దిక నిర్వహణ పైన మరింత సమాచారం కోరుతూ పయ్యావుల ఆర్దిక శాఖ కార్యదర్శికి లేఖ రాసారు.

 కలిసి రాని టీడీపీ నేతలు..

కలిసి రాని టీడీపీ నేతలు..

ఇక, మరో ఆసక్తి కర అంశం ఏంటంటే..టీడీపీలో ప్రభుత్వం నుండి ఎవరికి ఫిర్యాదు చేసినా నేతలు కలిసి కట్టుగా రాజ్ భవన్ కు వెళ్తారు. కానీ, పయ్యావుల ఫిర్యాదు సమయంలో ఆయనకు టీడీపీ నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. ఇక, ఏకంగా 40 వేల కోట్ల ఆర్దిక నిర్వహణ పైన పయ్యావుల ఫిర్యాదు చేసి...ప్రభుత్వం పైన పీఏసీ ఛైర్మన్ హోదాలో విమర్శలు చేస్తే...మద్దతుగా ఏ నాయకుడు మాట్లాడలేదు. బుగ్గన స్పందించిన తరువాత కూడా టీడీపీ ఆశించిన స్థాయిలో టీడీపీ నుండి పయ్యావులకు మద్దతు రాలేదు. అయితే, ఈ విషయం పైన టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

అధికార పార్టీలోనూ లైట్ గా..

అధికార పార్టీలోనూ లైట్ గా..

పయ్యావుల తొలి నుండి హార్డ్ కోర్ టీడీపీ నేతగా ఉన్నా..పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనకు తగిన గుర్తింపు లభించలేదు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సైతం మంత్రులుగా చేసినా..పయ్యావులను పట్టించుకోలేదు. కేవలం ఎమ్మెల్సీ చేసి పార్టీ విప్ చేసారు. దీంతో..పయ్యావుల 2019 లో గెలిచిన సమయం నుంచి వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ఇక, పాలిట్ బ్యూరోలోనూ ఆయనకు స్థానం దక్కలేదు. మరి..ఇంత సడన్ గా పయ్యావుల ప్రభుత్వాన్ని టార్గెట్ చేయటం వెనుక మరో ఆసక్తి కర పరిణామం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు.

వైసీపీతో టచ్ లో ఉన్నారంటూ..

వైసీపీతో టచ్ లో ఉన్నారంటూ..

పీఏసీ ఛైర్మన్ ఇచ్చినా...పార్టీ పట్ల పయ్యావుల గతంలో లాగా ఆసక్తి చూపించటం లేదనే భావన అధినేతకు ఉంది. దీంతో..పీఏసీ పదవి పయ్యావుల ను తప్పించి.. గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఇవ్వాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో..పయ్యావుల వెంటనే అలర్ట్ అయ్యారంటూ పార్టీ నేతలే చెబుతున్నారు. వచ్చే నెల ఆగస్టులో ఆయన పదవీ కాలం ముగియనుంది. దీంతో..బుచ్చయ్య కు కాకుండా తానే కొనసాగేందుకే... పయ్యావుల సడన్ గా ప్రభుత్వం పైన విమర్శలకు దిగారని టీడీపీ నేతల అంతర్గత చర్చల సారాంశం.

 బుచ్చయ్యచ చౌదరితో రీప్లేస్ మెంట్... అడ్డుకొనేందుకే

బుచ్చయ్యచ చౌదరితో రీప్లేస్ మెంట్... అడ్డుకొనేందుకే

అయితే, ఈ వ్యూహం బెడిసి కొట్టిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనిని ఏ ఒక్కరూ పెద్దగా సీరియస్ గా తీసుకున్నట్లుగా అటు వైసీపీ..ఇటు టీడీపీలో కనిపించలేదనే అభిప్రాయం ఉంది. మరి..ఈ ఆకస్మిక -వ్యూహాత్మక ఆర్దిక విమర్శలతో చంద్రబాబును మెప్పించారా అంటే అదీ లేదనే చెబుతున్నారు. మరి..పయ్యావుల పీఏసీ ఛైర్మన్ గా ఉంటారా లేక, చంద్రబాబు అనుకుంటున్న విధంగానే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి అప్పగిస్తారా అనేది రానున్న రోజుల్లో తేలిపోనుంది. ఇప్పుడు ఇదే అంశం అధికార - ప్రతిపక్ష పార్టీల్లో హాట్ టాపిక గా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+