వారికి విజయవాడ పోలీస్ కమిషనర్ స్ట్రాంగ్ వార్నింగ్..!!

Vijayawada City Police: దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. ఈ నెల 25వ తేదీన ఆరో విడత పోలింగ్ జరుగనుంది. ఇప్పటివరకు అయిదు విడతల్లో పోలింగ్ ముగిసింది. ఏపీ అసెంబ్లీ సహా మొత్తం 10 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ ఈ నెల 13వ తేదీన పూర్తయింది. ఆరు, ఏడు విడతల్లో పోలింగ్ ప్రక్రియ ముగియాల్సి ఉంది.

ఈ నెల 25, జూన్ 1 తేదీల్లో ఈ రెండు విడతలు షెడ్యూల్ అయ్యాయి. అక్కడితో దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. అదే నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఏపీ సహా కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఏ పార్టీ అనేది అప్పుడే తెలిసిపోతుంది.

PD Acts and rowdy sheets will be opened says Vijayawada Police

కాగా ఏపీలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటోన్నారు. పోలింగ ముగిసిన అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి దాడులు సంభవించనివ్వకుండా ఏర్పాట్లు చేస్తోన్నారు.

ఇందులో భాగంగా- ఒంగోలులో మాక్ డ్రిల్‌ను నిర్వహించారు ఏపీ పోలీసులు. హింసాత్మక పరిస్థితులు తలెత్తినప్పుడు ఎలా వ్యవహరించాలనే విషయంపై మాక్ డ్రిల్ చేపట్టారు. టైర్లను కాల్చి రోడ్లపై పడేశారు. పెట్రోల్ నింపిన సీసాలను గాల్లోకి విసిరేశారు. పెద్ద ఎత్తున లాఠీఛార్జీ చేశారు. అల్లరి ముూకలను చెదరగొట్టడానికి గాల్లోకి సైతం కాల్పులు జరిపారు. ఇదంతా మాక్ డ్రిల్‌లో భాగమే.

అదే సమయంలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ పీహెచ్‌డీ రామకృష్ణ హెచ్చరికలు జారీ చేశారు. విధ్వేషాలను రెచ్చగొడుతూ, దాడులు- ఘర్షణలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని అన్నారు. శాంతియుత వాతావరణానికి భంగం వాటిల్లేలా ప్రవర్తించే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని చెప్పారు.

ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నామని, ఇందులో భాగంగా సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలు, గ్రామాల్లో పోలీస్ పికెటింగ్‌ను ఏర్పాటు చేశామని అన్నారు. రౌడీలు, గూండాలు, పాత నేరస్తులు, ఘర్షణలకు పాల్పడొచ్చంటూ అనుమానం ఉన్న వారిని బైండోవర్ చేశామని తెలిపారు.

జిల్లావ్యాప్తంగా పోలీస్ యాక్ట్‌లోని 144 సీఆర్పీసీ సెక్షన్ 30 అమలులో ఉందని పీహెచ్‌డీ రామకృష్ణ గుర్తు చేశారు. అభ్యర్థులు ఎలంటి ర్యాలీలు, విజయోత్సవ వేడుకలు, ఊరేగింపులను నిర్వహించడానికి అనుమతి లేదని చెప్పారు. బాణాసంచా అమ్మకాలపై నిషేధం ఉందని గుర్తు చేశారు. బాణాసంచా కాల్చినా, వాటిని విక్రయించినా చర్యలు తీసుకుంటామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+