పెద్దిరెడ్డిని ఎందుకు అనర్హడిగా ప్రకటించకూడదు, హైకోర్టు ఆదేశాలు, మైండ్ బ్లాక్
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఊహించని ఎదురు దెబ్బ తగులుతోంది. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ని అనర్హుడిగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇదే విషయంపై గత అసెంబ్లీ ఎన్నికల్లో పుంగనూరులో పోటీచేసిన అభ్యర్థులు అందరికీ నోటీసులు జారీ చేయాలని గతంలోనే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని దాఖలైన పిటీషన్ పై విచారణ కొనసాగించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని పుంగనూరు అసెంబ్లీ నియోజక వర్గంలో పోటీ చేసిన అభ్యర్థులు అందరికీ ఆదేశాలు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి నెంబర్ 2 పొజిషన్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు వైసీపీలో తనకంటూ ఎదురు లేకుండా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చక్రం తిప్పారు.

వైఎస్. జగన్ సీఎం గా ఉన్నంతకాలం పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కూడా మంత్రి పదవిలో కొనసాగారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆయన భార్యకు సంబంధించిన 145 ఆస్తులు వివరాలను ఎన్నికల కమిషన్ అధికారులకు సమాచారం ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయంపై పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. పిటిషన్ విచారణ చేసిన హైకోర్టు పుంగనూరులో పోటీ చేసిన అభ్యర్థులందరికీ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని ఎందుకు అనర్హుడిగా ప్రకటించకూడదు అని చెప్పాలని పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులందరికీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని అనర్హకుడిగా ప్రకటించాలని గత అసెంబ్లీ ఎన్నికల్లో పుంగనూరులో పోటీ చేసిన బోడే రామచంద్ర యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేవలం 6 వేల మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె నియోజకవర్గం లో పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. పుంగనూరు ఎమ్మెల్యే రామచంద్రా రెడ్డి ఎన్నికల కమిషన్ తో పాటు ప్రజలను ప్రభుత్వాన్ని మోసం చేశారని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని అనర్హడిగా ప్రకటించాలని ఆ నియోజక వర్గంలో పోటీ చేసిన నాయకులు కోర్టుకు మనవి చేశారు. పుంగనూరు నియోజక వర్గంలో పోటీ చేసిన అభ్యర్థులు అందరూ కౌంటర్ దాఖలు చెయ్యాలని ఆదేశాలు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సెప్టెంబర్ 9వ తేదీకి విచారణ వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications