కేంద్ర అజెండా నుండి ప్రత్యేక హోదా తొలగింపు చంద్రబాబు కుట్రే: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
కేంద్ర హోంశాఖ అజెండా నుండి ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించడం టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపణలు గుప్పించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన చంద్రబాబును టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రత్యేక హోదాపై ఏపీలో చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి చంద్రబాబును టార్గెట్ చేసి కీలక వ్యాఖ్యలు చేశారు.

అజెండా నుండి ప్రత్యేక హోదా తొలగింపు చంద్రబాబు కుట్రే
కేంద్ర హోం శాఖ నేతృత్వంలో జరిగే విభజన హామీల సమావేశం అజెండా నుండి ప్రత్యేక హోదా తొలగింపు చంద్రబాబు కుట్రేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. బీజేపీలోని టీడీపీ నేతల ద్వారా ఈ పని చేయించారని ఆయన విమర్శలు గుప్పించారు. ఈ కుట్ర వెనక ముమ్మాటికీ చంద్రబాబు ఉన్నారని నిప్పులు చెరిగారు. అసలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదు అని విమర్శలు గుప్పించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

ప్రత్యేక ప్యాకేజీ కావాలని తీసుకుంది .. అమ్ముడుపోయింది టీడీపీనే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. అజెండాలోని 9 అంశాలను మీరే పెట్టి మీరే తీసేసారు అంటూ విమర్శించారు. చంద్రబాబు నుండి వచ్చిన ఒత్తిళ్లతో ఈ పని చేశారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. టీడీపీ నేతలే ప్రత్యేక హోదా వద్దని అమ్ముడుపోయారని, తెలుగుదేశం పార్టీనే ప్రత్యేక ప్యాకేజీ కావాలని తీసుకుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మండిపడ్డారు . ఇక గత మూడు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.

చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై మాట్లాడే అర్హత లేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో గత ఎన్నికల్లో జగన్ ఒంటరిగా పోరాటం చేశారని గుర్తు చేశారు. ఇక రాష్ట్రంలో బిజెపి, జనసేన నామమాత్రమే పార్టీలుగా మారిపోయాయని పేర్కొన్నారు. ఈ పార్టీలు చంద్రబాబుతో లోపాయికారి ఒప్పందం చేసుకుంటాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి నష్టం చేస్తుంది చంద్రబాబేనని ఆయన తేల్చి చెప్పారు. అసలు చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై మాట్లాడే అర్హత లేదని, ప్రత్యేక హోదా పై మాట్లాడేందుకు సిగ్గుండాలి అని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి స్పష్టం చేశారు.

ఏపీలో మళ్ళీ ప్రత్యేక హోదా రగడ ... వైసీపీ వర్సెస్ టీడీపీ
ఇదిలా ఉంటే రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రధాని హామీ అయినా ప్రత్యేక హోదాను సాధించే వరకూ పోరాట ఆగదని వైసీపీ మంత్రులు వైసిపి ఎంపీలు తేల్చి చెబుతున్నారు. ఇక టిడిపి నాయకులు మాత్రం ప్రత్యేక హోదా విషయాన్ని ఏపీ ప్రభుత్వం విస్మరిస్తోందని, పార్లమెంట్ వేదికగా వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా పై ఒత్తిడి తీసుకురావడం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ చేస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఏపీలో మరోమారు ప్రత్యేక హోదా అంశంపై రగడ కొనసాగుతుంది.












Click it and Unblock the Notifications